ETV Bharat / state

వరద నీటిని వృథా చేయొద్దు - రిజర్వాయర్లకు ఏకధాటిగా లిఫ్టింగ్‌ చేయాలని రేవంత్ ఆదేశం - CM Revanth Review on Water Pumping - CM REVANTH REVIEW ON WATER PUMPING

CM Revanth Review on Water Pumping : భారీవర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ఆయన సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు.

CM Revanth Review on Project Levels
CM Revanth Review on Water Pumping (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 7:12 PM IST

CM Revanth Review on Project Levels : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటినిల్వపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని, ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టీఎంసీకి తగ్గకుండా డ్రా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏకధాటిగా లిఫ్టింగ్‌కు ఆదేశం : నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు.

నిజాంసాగర్‌ వరకు పంపింగ్‌ : మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు సీఎం రేవంత్‌కు అధికారులు వివరించారు. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్‌ సాగర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని అక్కడి నుంచి సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మల్లన్నసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.43 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీల కెపాసిటీ ఉండగా 7.91 టీఎంసీ నీళ్లున్నాయని అధికారులు తెలిపారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్లన్నసాగర్‌లో గరిష్ఠంగా 18 నుంచి 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీల నిల్వ చేయాలని ఆదేశించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ అత్యవసర సమీక్ష- అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశం - CM REVANTH EMERGENCY REVIEW

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి - హుటాహుటిన నీటిని ఆపేసిన అధికారులు - Nagarjuna Sagar Left Canal Cut Off

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.