ETV Bharat / state

స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్ - Young India Skill University - YOUNG INDIA SKILL UNIVERSITY

CM Revanth Announced Skill University Chairman : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి ఛైర్మన్​గా ఆనంద్ మహీంద్రా నియమితులు కాబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ఓ సమావేశంలో ప్రకటించారు. మూడు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తొలిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో నైపుణ్యమిచ్చి, ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.

Young India Skill University
CM Revanth Announced Skill University Chairman (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 3:33 PM IST

Updated : Aug 5, 2024, 4:23 PM IST

Young India Skill University Chairman Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం తెలిపారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద శంకుస్థాపన చేసినట్టు సీఎం గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది, 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడం సహా ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

యూనివర్సిటీ ఛాన్సలర్​గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి : స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఛాన్సలర్​గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. పరిశ్రమల ప్రముఖులతో పాలకమండలి ఏర్పాటు చేయనున్నారు.

Telangana Young India Skill University : భవిష్యత్‌లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నట్టు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా - ఈఎస్​సీఐ భవనంలో స్కిల్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు.

"ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్​ ఉంది. యువతకు స్కిల్స్​ నేర్పించాలనే సదుద్దేశంతో కొత్త యూనివర్సిటినీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్​, దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహీంద్రాను ఈ యూనివర్సిటీకి ఛైర్మన్​గా వ్యవహరించాలని కోరాను. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది." -రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

గత పాలకులు మూడు నగరాలు నిర్మించారు - మేము నాలుగో సిటీని నిర్మిస్తాం : సీఎం రేవంత్ - Young India Skill University

స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నాం : రేవంత్ రెడ్డి - CM Revanth On Skill University

Last Updated : Aug 5, 2024, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.