ETV Bharat / state

'గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకండి, అవి కనిపిస్తే 100కు కాల్ చేయండి' - స్టూడెంట్స్​కు సీఎం అడ్వైజ్

డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పిన గురుకుల విద్యార్థులు - ఈనెల 14న రెండో విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తామన్న ముఖ్యమంత్రి

CM REVANTH ON INTEGRATED SCHOOLS
CM Revanth Reddy Advice to School Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

CM Revanth Reddy Advice to School Students : రెండో విడత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఈనెల 14న మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదే రోజున 15వేల మందితో ఒక మంచి కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సచివాలయంలో వైరా, మధిర నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

నాణ్యమైన చదువు అందించడమే తమ లక్ష్యమని అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 21వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు, 11 వేల 62 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. చదువుతో పాటు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే విద్యార్థి, నిరుద్యోగుల కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు.

వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం : చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న సీఎం ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుల సచివాలయంలో అడుగుపెట్టి పరిపాలనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

'యూనివర్సిటీలపై గౌరవం తగ్గింది - సరిదిద్దే బాధ్యత మీదే'

ఎంబీబీఎస్ స్టూడెంట్ సాయిశ్రద్ధకు సర్కార్ సాయం - ఆర్థికసాయం అందించిన సీఎం రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.