ETV Bharat / state

సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి స్వగ్రామ పర్యటన - ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

స్వగ్రామంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

CM Revanth Participate Dussehra Celebrations in kondareddypally
CM Revanth Participate Dussehra Celebrations (ETV Bharat)

CM Revanth Participate Dussehra Celebrations in kondareddypally : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొంటున్నారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ముఖ్యమంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పూల జల్లులు, డప్పు దరువులు, కోలాటాలతో ఆహ్వానించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రూ.64 లక్షలతో ఆధునిక బస్టాండ్, సెంట్రల్ లైటింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. రూ.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.