ETV Bharat / state

సీఎం రేవంత్ దిల్లీ పర్యటన - టీ-ఫైబర్ ప్రాజెక్టుపై వడ్డీలేని రుణానికి విజ్ఞప్తి - CM REVANTH DELHI TOUR - CM REVANTH DELHI TOUR

CM Revanth Delhi Tour : దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో భేటీ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నూతన పీసీసీ చీఫ్‌, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించారు. అనంతరం రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయి చర్చించారు.

REVANTH MET KHARGE AND RAHUL GANDHI
CM Revanth Delhi Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 3:09 PM IST

Updated : Aug 23, 2024, 7:26 PM IST

CM Revanth Delhi Tour : దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ తదితరులతో సమావేశమయ్యారు. గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీలను ఆహ్వానించారని, అలాగే రెండు లక్షల రుణ మాఫీ చేసినందుకు వరంగల్​లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రులతో భేటీ : ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర టెలికాం, కమ్యునికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భార‌త్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు స‌మ‌ర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని విజ్ఞప్తి చేశారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు టీ- ఫైబర్ ప్రధాన ఉద్దేశమని కేంద్రమంత్రికి వివరించారు. టీ-ఫైబర్​కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు విన్నవించారు.

CM Revanth Delhi Tour
కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్ భేటీ (ETV Bharat)

మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌తో సమావేశం : అనంతరం కేంద్ర క్రీడలశాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌తో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థికసాయం చేయాలని, ఖేలో ఇండియా ప‌థ‌కం నిధుల పెంచాల‌ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో క్రీడల నిర్వహణకున్న వసతులు, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల గురించి వివరించారు. గతంలో హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచ్చిన క్రీడల గురించి వివరించిన సీఎం, వచ్చే ఏడాది జరిగే ఇండియా యూత్ గేమ్స్ అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే భవిష్యత్‌లో కామ‌న్‌వెల్త్ గేమ్స్ నిర్వహించే అవ‌కాశం ఇవ్వాలని విన్నవించారు.

CM Revanth Delhi Tour
కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సీఎం రేవంత్ భేటీ (ETV Bharat)

'16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే - మోదీ చేసిందే రెండింతలు ఎక్కువ' - CM REVANTH ON ADANI ISSUES

సీఎం రేవంత్​తో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

Last Updated : Aug 23, 2024, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.