CM Revanth Meet Ramojirao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్ పర్యటనలో పాల్గొన్న అనంతరం నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. రామోజీ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావును కలిశారు. ముఖ్యమంత్రికి రామోజీరావు(Ramojirao) బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, ప్రజాపాలన విధానాలపై చర్చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు కూడా భేటీలో చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో ఈనాడు ఎండీ కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం
'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'