ETV Bharat / state

సమ్మక్క-సారక్కలకు ఆన్​లైన్​లో నిలువెత్తు బంగారం - కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​ - Medaram Jatara Online Bangaram

CM Revanth Launch Online Bangaram to Sammakka Saralamma : ఆన్​లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. శాసనసభ కమిటీ హాలులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు హాజరయ్యారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రేవంత్ సర్కార్​ కల్పించింది.

Medaram Jathara 2024
CM Revanth Launch Online Bangaram to Sammakka Saralamma
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 8:53 PM IST

Updated : Feb 9, 2024, 10:22 PM IST

CM Revanth Launch Online Bangaram to Sammakka Saralamma : శాసనసభ కమిటీ హాలులో ఆన్‌లైన్ ద్వారా మేడారం సమ్మక్క - సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా(Minister Damodara Rajanarsimha), ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

CM Revanth Booked Online Bangaram For Riyansh : తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సీఎం సమర్పించారు. అదేవిధంగా తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్‌లైన్‌ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కూడా సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం, మేడారం సమ్మక్క - సారలక్క అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారం సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మంత్రులు వెల్లడించారు.

Medaram Jatara Bangaram Online : మేడారం జాతర ఆన్​లైన్, ఆఫ్​లైన్ సేవలను దేవదాయ శాఖ(Endowment Department) ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మేడారం వెళ్లలేని భక్తులకు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు, ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని సైతం కల్పించారు. మేడారం సేవలను రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఇదివరకే ప్రారంభించారు.

నో ప్లాస్టిక్ జోన్​గా మేడారం జాతర - భారీ ఎత్తున అవగాహనకు ప్రణాళిక

మీసేవ, పోస్టాఫీసులతో పాటు ప్రజలందరికీ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉండే టీ-యాప్ ఫోలియో యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. బరువును బట్టి కిలోకు 60 రూపాయలు చెల్లిస్తే నిలువెత్తు బెల్లం నేరుగా అమ్మవారి గద్దెల వద్ద సమర్పించేలా దేవస్థానం తీసుకుంటుంది. అమ్మవారి ప్రసాదం కోసం పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాలు, టీ-యాప్ ఫోలియో యాప్(T App Folio) ద్వారా డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదం కూడా పొందవచ్చు.

ఇంట్లో నుంచే వనదేవతలకు బంగారం సమర్పణ : టీయాప్​తో పాటు, రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీసేవా కేంద్రాలు, దేశంలోని సుమారు లక్షన్నర పోస్టాఫీసుల ద్వారా పోస్టల్ కేంద్రాలు(Postal Centers) ఈ సేవలను అందిస్తాయని మంత్రి కొండా సురేఖ వివరించారు. సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలు కొనసాగుతాయన్నారు.

తెలంగాణ సమాజం మహిమాన్విత శక్తులుగా కొలిచే సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారు. వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ ఆన్​లైన్​ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మీ సేవ వెబ్ సైట్ ద్వారా తన మనవడు కొండా మురళీకృష్ణ పేరిట నిలువెత్తు బంగారం సమర్పణకు బుక్ చేశారు.

మహాజాతరకు మరమ్మత్తుల 'బాట' - ముమ్మరంగా కొనసాగుతున్న పనులు

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు

Last Updated : Feb 9, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.