ETV Bharat / state

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రండి - గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్​ను ఆహ్వానించిన సీఎం రేవంత్ - CM Revanth Meet Governor 2024

CM Revanth Meet Governor 2024 : రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.

CM Revanth Meet Governor CP Radhakrishnan
CM Revanth Meet Governor CP Radhakrishnan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 12:36 PM IST

Revanth Invite Governor to TG Formation Day Celebrations : హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆయనను ఆహ్వానించారు. దాదాపు 40 నిమిషాల పాటు వారు గవర్నర్‌తో భేటీ అయ్యారు. అలాగే వేడుకలకు సంబంధించిన వివరాలను సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ వేడుకలను జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే.

Decade Celebrations of Telangana State 2024 : మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. జూన్‌ 2న ఉదయం పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉండనున్నాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.