ETV Bharat / state

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ - CM REVANTH AMERICA TOUR - CM REVANTH AMERICA TOUR

CM REVANTH AMERICA TOUR : రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని రేవంత్‌ రెడ్డి సందర్శించారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌కేర్ రంగాలపై స్టాన్‌ఫోర్డ్ ప్రతినిధులతో చర్చించారు. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ హైదరాబాద్‌లో కేపబులిటీ సెంటర్‌ను విస్తరించి, సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని జొయిటిస్ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించింది.

CM Revanth US Tour
CM REVANTH AMERICA TOUR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 5:26 PM IST

CM Revanth US Tour : అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జొయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

స్టాన్‌ఫోర్డ్ ప్రతినిధులతో భేటీ : వీటిపై సానుకూలంగా స్పందించిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు, ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్‌ఫోర్డ్ ప్రతినిధులు అనురాగ్ మైరాల్, జోష్ మేకొవర్ పేర్కొన్నారు. కొత్త సంస్కరణలో తెలంగాణ భారత్‌లో ముందు వరసలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.

స్టాన్‌ఫోర్డ్ వంటి గ్లోబల్ లీడర్ల భాగస్వామ్యంతో హెల్త్‌కేర్ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, స్టాన్‌ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు.

గూగుల్‌ క్యాంపస్‌ పర్యటన : కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎలా వినియోగించుకోవచ్చుననే అనే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ప్రముఖ అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్‌ కంపెనీ ప్రతినిధులు కీత్ సర్‌బాగ్, అనిల్ రాఘవ్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించింది.

CM Revanth US Tour
గూగుల్‌ క్యాంపస్‌ పర్యటించిన సీఎం రేవంత్‌ (ETV Bharat)

జొయిటిస్‌ సంస్థ సుముఖత : హైదరాబాద్​లో తమ కెపాబులిటీ సెంటర్‌ను సెప్టెంబరులో విస్తరించనున్నట్లు జొయిటిస్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. అమెజాన్, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతోనూ చర్చలు జరగనున్నాయి. గోల్డెన్ గేట్ బ్రిడ్జిని సందర్శనతో అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు.

యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు - CM REVANTH AMERICA TOUR

హైదరాబాద్​లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ సెంటర్ - సంస్థతో సీఎం రేవంత్​ ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.