CM Revanth Delhi Tour Today : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ, రేపు రెండు రోజులు దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా దిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు కావడంతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy Visit Delhi Today : ప్రధానంగా లోకసభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హస్తం పార్టీలోకి చేరికలు పెరగడం, మరికొందరు నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉండటం గురించి హైకమాండ్‌తో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. అదేవిధంగా శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్ రాని నాయకులకు, పార్టీ గెలుపుకు పని చేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటి భర్తీ విషయంలో గత కొన్నిరోజులుగా కసరత్తు కొనసాగుతోంది.
ఇప్పటికే దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు ఇందుకు సంబంధించిన జాబితాలను సిద్దం చేశారు. సీనియర్ నాయకులతో కూడా చర్చించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఏఐసీసీతో సమావేశమై తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
అదేవిధంగా మంగళవారం వివిధ శాఖల కేంద్ర మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CMinister Bhatti Vikramarka), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలువనున్నారు. ఇప్పటికే ఆర్థిక, రైల్వేశాఖలకు చెంది అనుమతి లభించగా మరికొన్ని శాఖలకు సంబంధించి అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ శాఖల మంత్రులతో కలిసి కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం. పెండింగ్ నిధులు, కొత్తగా ఇవ్వాల్సిన నిధుల కేటాయింపు తదితర అంశాలపై వారు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా : రేవంత్ రెడ్డి