CM Revanth At Old City Metro Foundation : హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు సీఎం వివరించారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా వరకు ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రోరైలు(Metro Train) మార్గానికి సీఎం, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి శంకుస్థాపన చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భాగ్యనగర అభివృద్ధిని ఏమాత్రం తగ్గకుండా సర్కార్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు, మీరాలం వంతెన కోసం 360 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చాంద్రాయణజంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సీఎం పాతబస్తీకి(Old City in Hyderabad) అవసరమైన నిధులన్నీ సమకూరుస్తామని తెలిపారు.
"కులీ కుతుబ్‌షా నుంచి మొదలు పెడితే, నిజాం నవాబులు వరకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అంతర్జాతీయ చిత్ర పటంలో భాగ్యనగరానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠను తీసుకువచ్చారు. ఆ ఖ్యాతిని కొనసాగించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికలు వచ్చినపుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటాం."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
లోక్‌సభ ఎన్నికలు 2024 - నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy on Hyderabad Development : ఓల్డ్ సిటీగా ప్రసిద్ధి చెందిన పాతబస్తీనే అసలైన హైదరాబాద్‌గా సీఎం అభివర్ణించారు. గత ప్రభుత్వం ధనికుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో మార్గం ప్రతిపాదించగా, తమ ప్రభుత్వం మాత్రం పేదలందరికీ పనికొచ్చేలా మార్పులు చేసిందని సీఎం పేర్కొన్నారు. చంచల్‌గూడ కారాగారాన్ని(Chanchalguda Central Jail) నగరం శివారు ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్, పాతబస్తీ వాసుల చదువు కోసం విద్యాలయాలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో ఉన్న అందరు ముస్లింల గొంతుకగా వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమేని ముఖ్యమంత్రి కొనియాడారు.
రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు : "హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తారని ఆశిస్తున్నాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఇంతటి స్థాయికి వచ్చారు. రాష్ట్రంలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి, వాటిని సమూలంగా అడ్డుకోవాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధిలో రేవంత్‌రెడ్డికి మేం అండగా ఉంటాం.’’ అని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు.
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి
రోగుల జీవితాల్లో నవ్వులు పూయించడమే లక్ష్యంగా వైద్యులు పని చేయాలి : సీఎం రేవంత్