ETV Bharat / state

జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు భరోసా - నిధులు విడుదల చేసిన సీఎం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 7:54 PM IST

CM Jagan Released Funds for ONGC Victims Fisherman: మత్స్యకారులకు తోడుగా, భరోసా కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని సీఎం జగన్‌ అన్నారు. ఓఎన్​జీసీ (ONGC) పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారంగా 161 కోట్ల 86 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని జగన్ బటన్‌ నొక్కి విడుదల చేశారు.

CM_Jagan_Released_Funds_for_ONGC_Victims_Fisherman
CM_Jagan_Released_Funds_for_ONGC_Victims_Fisherman

జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు భరోసా - నిధులు విడుదల చేసిన సీఎం

CM Jagan Released Funds for ONGC Victims Fisherman: ఓఎన్​జీసీ (ONGC) పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని అందించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23 వేల 458 మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు 11,500 రూపాయల చొప్పున 6 నెలలకుగాను 69 వేల రూపాయల పరిహారం చెల్లించారు. మొత్తంగా 161 కోట్ల 86 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి సీఎం విడుదల చేశారు.

ఓఎన్​జీసీకి సంబంధించి ఇప్పటి వరకు 5 విడతలుగా 647 కోట్ల రూపాయల పరిహారం చెల్లించినట్లు సీఎం తెలిపారు. మత్స్యకారులకు తోడుగా, భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న ఆయన ఐదేళ్లలో 1 లక్షల 7వేల కుటుంబాలకు వైఎస్ఆర్ మత్య్సకార భరోసా పథకం కింద 538 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు. మత్స్యకారులకు గతంలో 4 వేలు ఇచ్చిన పరిహారాన్ని 10 వేలకు పెంచి ఇస్తున్నామని, మత్స్యకారులకు డీజిల్​పై గతంలో 6 రూపాయల సబ్సిడీ ఇస్తుండగా దాన్ని 9 రూపాయలకు పెంచినట్లు తెలిపారు.

సిద్ధం, సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం: పవన్ కల్యాణ్

20 వేల 812 బోట్లకు 135 కోట్ల రూపాయలు డీజిల్ సబ్సిడీ రూపంలో ఇచ్చామన్నారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తున్నామని, 175 కుటుంబాలకు 17 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చి కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ 1.50 రూపాయలకు ఇస్తూ 40 వేల 850 మందికి 3,497 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. మత్స్యకార కుటుంబాలకు కేవలం 4 పథకాల ద్వారానే 4,913 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామన్నారు.

ప్రతి 50 కిలోమీటర్లకు సీ పోర్టు, ఫిషింగ్ హార్బర్​ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇవాళ జరగాల్సిన నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు సీఎం తెలిపారు. 289 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ వల్ల జరిగే ప్రయోజనాలను మత్స్యకారులకు ప్రచారం చేసి తెలియజేయాల్సి ఉందని, ఈ క్రమంలో త్వరలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్​ను ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం - విలీన గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.