ETV Bharat / state

ఐదేళ్లు మోసం చేశారు - ఇప్పుడెలా వస్తున్నారు ? - సీఎం జగన్​ను ప్రశ్నిస్తున్న కాకినాడ ప్రజలు - Jagan Not Fulfil Promises to people - JAGAN NOT FULFIL PROMISES TO PEOPLE

CM Jagan Not Implement the Promises to People: రాష్ట్రంలో మేము సిద్ధం పేరుతో బస్సు యాత్ర సీఎం జగన్​కు ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఐదు సంవత్సరాలలో ఆయన​ ఇచ్చిన హామీలను మర్చిపోయి పరిపాలన సాగించడంతో జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేకున్నారు. పేదలకు ఇళ్లకు బదులు ఊళ్లకు ఊళ్లే కడతామంటూ గొప్పలు పలికి నిర్లక్ష్యం వహించారు. జగనన్న కాలనీలను జల కాలనీలుగా మార్చేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

CM Jagan Not Implement the Promises to People

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 7:58 AM IST

ఐదేళ్లు మోసం చేశారు - ఇప్పుడెలా వస్తున్నారు ? - సీఎం జగన్​ను ప్రశ్నిస్తున్న కాకినాడ ప్రజలు

CM Jagan Not Implement the Promises to People: కాకినాడ జిల్లా ప్రజలకు లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చిన సీఎం జగన్‌ ఐదు సంవత్సరాలుగా వాటిని అమలు చేయలేదు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూనే పొలాలు తడిపే ప్రాజెక్టులను ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారు. మత్స్యకారులకు మేలు చేస్తామంటూ చేపల రేవు పనులను పక్కన పెట్టారు. ఊళ్లకు ఊళ్లే కడతామంటూ పేదల ఇళ్లపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జగనన్న కాలనీలను జల కాలనీలుగా మార్చేశారు. ఐదు సంవత్సరాలుగా అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు బస్సు యాత్ర పేరిట తమ ప్రాంతంలో పర్యటించేందుకు ఎలా వస్తున్నారని కాకినాడ జిల్లా ప్రజలు జగన్​ను ప్రశ్నిస్తున్నారు.

సీఎం జగన్​కు జనం కరవు -​ వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra

కొంప కొల్లేరు చేస్తావా అన్న నానుడి గురించి కాకినాడ జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు. సీఎం జగన్‌ దాన్ని మార్చేసి కొంప ఏలేరు చేస్తా అన్న కొత్త నానుడిని జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను పూర్తిగా సీఎం జగన్‌ నిలిపేశారు. జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు రూ. 142 కోట్లు, రెండో దశ పనులకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు 2022 జులై 29న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొని ప్రకటించారు. కానీ నిధులు విడుదల కాలేదు. ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తైన 52 శాతం పనులు మినహా జగన్‌ పాలనలో ఎలాంటి పురోగతీ లేదు.

గతంలో రూ.100 కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయి. మూడు దశాబ్దాల క్రితం రూ.15 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు ఖర్చు ప్రస్తుతం రూ.350 కోట్లకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2022 నవంబరు 4న గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించినా నేటికీ పైసా కూడా విడుదల చేయలేదు. రైతులు మాత్రం జగన్‌ హామీలు ఎప్పుడు నెరవేరతాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి అలసిపోయారు.

చెట్లు నరికేయడం - దుకాణాలు తొలగిస్తున్నారంటే 'అన్నొస్తున్నట్లే' - CM Jagan Tour Trees Cuts

జిల్లాలో చేపల రేవు పూర్తైతే 2,500 పడవలు నిలిపే ఏర్పాటు ఉండేది. లక్షా 10 వేల మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరికేది. ఇంత ప్రయోజనం కలిగించే ఉప్పాడలో రూ.422 కోట్లతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పూర్తి చేయలేదు. గత సంవత్సరం మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు. నిర్మాణ సంస్థకు 36 ఎకరాలకు గాను 28 ఎకరాలను మాత్రమే అప్పగించారు. 2020 నవంబరులో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునూ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయలేకపోయారు. మత్స్యకారుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.

హర్బర్​ను త్వరగా పూర్తి చేస్తే జీవన ఉపాధి బాగుంటుందనుకుంటే మధ్యలోనే వదిలేయడంతో బోట్లు తిరగబడి మత్య్సకారులు చనిపోతున్నారు. జెట్టి నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. కాండ్రకోటకు రైతులు వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారిని సైతం పట్టించుకోవట్లేదు. టీడీపీ నేతలు మరమ్మతులు చేయిస్తామంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. - బాధితులు

భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts

గత ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో కాకినాడ జిల్లాలో ఐటీకి అడుగులు పడ్డాయి. జగన్‌ వచ్చాక ఒక్క కొత్త ఐటీ సంస్థ కూడా కాకినాడ ముఖం చూడలేదు. అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా తరలిపోయాయి. సర్పవరంలో ఐటీ కారిడార్‌ ఏర్పాటు అభివృద్ధి ప్రతిపాదనను జగన్ పక్కన పెట్టారు. మౌలిక సదుపాయాలు సరిగా లేక సైయంట్‌ కంపెనీని కూడా నేడో రేపో తరలించే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. అదొక్కటీ వెళ్లిపోతే జిల్లాలో ఇక ఐటీ జాడ లేకుండా పోతుంది.

రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల పథకానికి అప్పట్లో కొత్తపల్లి మండలం కొమరగిరిలోనే శంకుస్థాపన చేశారు. ఇళ్లు కాదు ఊళ్లే కడతామంటే ప్రజలు అమాయకంగా నమ్మారు. అధికారంలో ఉండి హామీలు గుప్పిస్తుంటే కలల ప్రపంచంలో విహారించారు. కాలనీలకు అనుసంధానంగా జనతా బజార్లు, క్లినిక్‌లు, పాఠశాల, పార్కులు ఇలా అన్నీ వచ్చేస్తాయంటే సంబరపడ్డారు. అయితే జగనన్న కాలనీల్లో చిన్న చినుకు పడితే చాలు ముంపునకు గురవుతున్నాయి. పేదల గూడు ఆశలపై నీళ్లు చల్లిన జగన్‌ మీరు కట్టే ఊళ్లు ఇవేనా అని ఇప్పుడు జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

టిడ్కో ఇళ్ల రుణ మాఫీపై మడమ తిప్పిన జగన్ - Jagan Fraud Tidco Beneficiaries

కాండ్రకోట వద్ద డ్రాప్‌ కమ్‌ బెడ్‌ రెగ్యులేటర్‌ పున:నిర్మాణానికి రూ.6 కోట్లతో పనులు చేపడతామని జగన్‌ హామీ ఇచ్చారు. నిధుల కోసం అధికారులు తిరిగి తిరిగి దస్త్రాన్ని పక్కన పడేశారు. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట - తూర్పుపాకలకు వెళ్లే మార్గంలో శిథిలమైన హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు ఇస్తే రైతులు పడుతున్న బాధలు తప్పేవి. వంతెన కడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి 8 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆశపడిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. సామర్లకోటలో జూనియర్‌ కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చేందుకు రూ.18 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నిధులు విడుదల కాక పనులు మొదలు కాలేదు. జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా బస్సు యాత్ర పేరిట మోసం చేసేందుకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సీఎం బస్సు యాత్రతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అవస్థలు - CM Jagan Siddam BUS Yatra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.