CM Jagan Inaugurates Dr BR Ambedkar Statue : విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార సభలా మార్చేశారు. రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవడం, ఆయన్ను ప్రస్తుతించుకోవడం కంటే జగన్‌కు మితిమీరిన భజన చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అసలు అక్కడ జరుగుతున్నది అంబేడ్కర్ విగ్రహావిష్కరణా లేదా జగన్ సన్మాన సభా అన్నట్లుగా ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన సభలోనూ, ఆ తర్వాత స్వరాజ్ మైదానంలో నిర్వహించిన విగ్రహావిష్కరణలోనూ అడుగడుగునా జగన్‌కు చిడతలు కొట్టడానికే పెద్దపీట వేశారు.
Ambedkar Statue in Vijayawada : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం ప్రదర్శించిన డ్రోన్ షో, లేజర్ లైట్ షోలలో అంబేడ్కర్‌తో సమానంగా నవరత్నాల లోగో మధ్యలో జగన్ ఉన్న చిత్రాన్ని పలుమార్లు చూపించారు. అంబేడ్కర్ విగ్రహం కంటే ఎత్తులో కొన్నిసార్లు, పక్కనే మరికొన్నిసార్లు జగన్ బొమ్మను ప్రదర్శించారు. జగన్ చిత్రం కింద "పీపుల్స్ లీడర్" అంటూ డ్రోన్ షోలో చూపించారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మైకుల్లో హోరెత్తించారు. "సామాజిక న్యాయ మహా శిల్పం-ఆవిష్కర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి" అంటూ రాసున్న చోట వైఎస్సార్సీపీ రంగులతో కూడిన వెలుగు కనిపించేలా విద్యుత్తు దీపాలను ఏర్పాటుచేశారు. సభా వేదికను వైఎస్సార్సీపీ జెండా పోలిన రంగులతో తీర్చిదిద్దారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలన్నది టీడీపీ ఆలోచనే: శ్రావణ్ కుమార్
దళితులు వైఎస్సార్సీపీకి దూరమవుతున్నారనే అభద్రతాభావం మంత్రుల ప్రసంగాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. వారంతా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమనే స్పృహ లేకుండా ఎన్నికల ప్రచారసభ అన్నట్లే మాట్లాడారు. దళితులను చేయిపట్టుకుని నడిపించే నాయకుడు ఎవరనేది గుర్తించాలని, అలాంటి ముఖ్యమంత్రి జగన్ అని, ఆయన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో దళితులు తమ ఓటు జగన్‌కే వేయాలని విన్నవించారు. కార్యక్రమంలో దళిత మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌కు అవమానం జరిగింది. మ్యూజియం పరిశీలనకు ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు మంత్రులు పార్కులో నుంచి మ్యూజియం వైపు వెళ్లేందుకు యత్నించగా ఆక్టోపస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందిని తోసుకుని ముందుకెళ్లేందుకు మంత్రి నాగార్జున ప్రయత్నించినా వారు ఆయన్ని ఆపేశారు. దీంతో చేసేది లేక మంత్రులిద్దరూ మరో మార్గంలో సీఎం వద్దకు వెళ్లారు.
అంబేద్కర్ ఏం చెప్పారు ? సీఎం జగన్ ఏం చేస్తున్నారు ?
రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగినా గవర్నర్ ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తరఫున గవర్నర్‌ను ఆహ్వానించారా లేదా? ఒకవేళ ఆహ్వానించినా హాజరుకాలేదా? అనే అంశాలు ప్రశ్నలుగా మిగిలాయి. రాజ్యాంగ నిర్మాంత విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనే రాజ్యాం విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో వందల కోట్ల రూపాయల దోపిడీ: టీడీపీ నేతలు