ETV Bharat / state

అన్నొస్తే అన్నీ బందే - ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు - JAGAN ELECTION CAMPAIGN - JAGAN ELECTION CAMPAIGN

CM Jagan Election Campaign in Anakapalli District : అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం పర్యటన సందర్భంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారు. ఈ విషయం తెలియక బస్టాండ్​కు చేరుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు లేకపోవటంతో కాలేజీకి వెళ్లలేకపోయామని విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు.

CM_Jagan_Election_Campaign_in_Anakapalli_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 11:56 AM IST

CM Jagan Election Campaign in Anakapalli District : అన్నొస్తున్నాడు కరెంటు తీస్తున్నారు. అన్నొస్తున్నాడు చెట్లు కొట్టేస్తున్నారు. అన్నొస్తున్నాడు బస్సులు నిలిపివేస్తున్నారు. ఇది ఏపీలో జగన్ పర్యటనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు. ప్రజలను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఇంకా ప్రజల పక్షపాతినని జగన్ చెప్పుకోవటంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థం కావటం లేదు.

అన్నొస్తే అన్నీ బందే - ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు

Passengers Facing Problems due to Jagan Campaign : సీఎం జగన్ సభలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఎక్కడ సభలు ఏర్పాటు చేసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రయాణికులు ఉదయం నుంచి కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఒకవైపు తీవ్ర ఎండతో పాటు వడగాలులు వీస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పటం లేదు. అన్న వస్తున్నాడు అంటే సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం సామాన్య ప్రజలకు ఇక్కట్లు

ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారుల సూచనలు : అనకాపల్లి జిల్లా చోడవరంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రచారానికి వస్తుండటం స్థానికులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. చోడవరంలో అధికారులు ఆర్టీసీ బస్సుల్ని ఆపేయటంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. విశాఖ, అనకాపల్లి వెళ్లాల్సిన వారు వెంకన్నపాలెం కూడలికి, పాడేరు, నర్సీపట్నం వెళ్లాల్సిన వాళ్లు వడ్డాది వెళ్లమని అధికారులు సూచిస్తున్నారు.

దుకాణాలకు అడ్డంగా బారికేడ్లు- రోడ్లపై ప్రమాదకరంగా పార్టీ జెండాలు 'ఇదేం సాధికార యాత్ర సారూ!'

ఇబ్బందుల్లో ప్రజలు : జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను చోడవరం పట్టణంలోని కొత్తూరు జంక్షన్​లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చోడవరం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి, సబ్బవరం, విజయనగరం రూట్లలో వెళ్లే బస్సులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక ఆటోలను, ఇతర ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు.

"సుమారు గంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. బస్సులు రావు ఆటోలకు వెళ్లమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం."- ప్రయాణికురాలు

చెట్లు నరికేయడం - దుకాణాలు తొలగిస్తున్నారంటే 'అన్నొస్తున్నట్లే' - CM Jagan Tour Trees Cuts

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.