ETV Bharat / state

ఉద్యానవన పంటల రైతులకు వైఎస్సార్సీపీ సర్కార్‌ మొండిచేయి! - గుంటూరులో సాగునీటి కష్టాలు

CM Jagan Cheated Horticulture Farmers: ఉద్యానవన పంటల సాగుకు చేయూత అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు చెప్పిన మాటలు నమ్మి ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు సంప్రదాయ సాగును పక్కన పెట్టి ఉద్యాన పంటల వైపు మళ్లారు. గత ప్రభుత్వాలు రాయితీలు సకాలంలో అందించడంతో మంచి ఫలితాలు సాధించిన రైతులు, జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టాలు చవి చూస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు డ్రిప్‌, స్ప్రింక్లర్ల మంజూరు నిలిపివేతతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CM_Jagan_Cheated_Horticulture_Farmers
CM_Jagan_Cheated_Horticulture_Farmers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 9:50 AM IST

ఉద్యానవన పంటల రైతులకు వైఎస్సార్సీపీ సర్కార్‌ మొండిచేయి!

CM Jagan Cheated Horticulture Farmers : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 68 వేల హెక్టార్లలో రైతులు ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అరటి, జామ, బొప్పాయి, కాకర, బీర, సొర, దొండ, చిక్కుడు, టమాటా పంటలను సాగు చేస్తున్నారు. అధునాతన పద్ధతుల్లో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఆ ఊసే మరిచిందని అన్నదాతలు అంటున్నారు.

వెంటాడుతున్న నీటి కష్టాలు : నారాకోడూరు, సుద్దాపల్లి, గొడవర్రు, అనంతవరప్పాడు సహా అనేక గ్రామాల్లో ఉద్యానవన పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. పందిరి, పెట్టుబడితో కలిపి ఎకరానికి మూడు లక్షల వరకూ ఖర్చు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి డిసెంబర్​లో వచ్చిన తుపాను ఉద్యానవన రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీసింది. తుపాను మిగిల్చిన కష్టాన్ని తట్టుకుని మళ్లీ పంట వేసిన అన్నదాతలను ఇప్పుడు సాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగర్‌ నుంచి ప్రభుత్వం నీరు విడుదల చేయక పంట చేతికి వచ్చేలా లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Suffering Due to Rain Conditions in AP: కీలక సమయంలో ముఖం చాటేసిన వరుణుడు.. రైతు కన్నీరు.. ఉద్యాన శాఖ పొంతనలేని ప్రకటనలు

ఆకాశాన్ని తాకిన రసాయనాల ధరలు : ఉద్యాన పంటల సాగుకు పెట్టుబడితో పాటు అదనపు ఖర్చులు ఎక్కువే. అయినప్పటికీ ప్రభుత్వం రాయితీల రూపంలో ఆదుకుంటుందనే ధైర్యంతో సాగు చేస్తున్న కర్షకులకు, జగన్‌ ప్రభుత్వం మూడేళ్లుగా మొండి చెయ్యే చూపుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 14 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం సాయం చేయకపోగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు యూరియా, రసాయనాల ధరలను విపరీతంగా పెంచేసి అదనపు భారం మోపుతోందని రైతులు వాపోతున్నారు.

నోటి కోటలు దాటాయి : గతేడాది బాపట్ల జిల్లాలోని ఉద్యానవన పంటలకు 25 కోట్లతో ప్రత్యేక రాయితీ ఇస్తామని ప్రకటించిన పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

YSRCP Government Neglect the Horticultural Crops: ఉద్యాన పంటల్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం..తీవ్రంగా నష్టపోతున్న రైతులు

కేంద్రం నిధులు లాగేసుకున్న రాష్ట్రం : రైతులకు అందించే రాయితీలలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాను భరించాలి. జగన్‌ ప్రభుత్వం తన వంతు వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే రాయితీలను ఇతర పథకాలకు మళ్లిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం రాయితీ నిధుల్ని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తోంది.

ఆదుకుంటే గట్టున పడతాం : "రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అధిక వర్షాలతో పంట నాశనం అయిపోయింది. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటే గట్టున పడతాం. ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు." మహిళా రైతు

Spandana program: కలెక్టర్ గారు స్పందించడి.. లేదా కారుణ్య మరణానికి అనుమతించండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.