ETV Bharat / state

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్​ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY - CHANDRABABU POLICY

CM Chandrababu on P-4 Policy : దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం "P-4" విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నదుల అనుసంధానాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, తయారీ రంగ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలన్నారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేశారు. భారత్‌ ఆర్థికంగా 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమైనందున 2047 నాటికి రెండు లేదా ఒకటో స్థానానికి ఎదిగేలా ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

CM Chandrababu on P-4 Policy
CM Chandrababu on P-4 Policy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 9:09 AM IST

Chandrababu on NITI Aayog : వికసిత భారత్‌-2047 లక్ష్యసాధనకు అవసరమైన రోడ్‌ మ్యాప్‌ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరఫున తన వాణి వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని చెప్పారు. ఇప్పుడు ప్రజలనూ భాగస్వాములను చేయాలంటూ సీఎం చంద్రబాబు పీ-4 విధానాన్ని నీతి ఆయోగ్‌ పాలక మండలి ఎదుట ఉంచారు.

ఏపీలో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తాం : ఈ విధానంతో పేదరిక నిర్మాలన సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో తొలి పది శాతం మంది సంపన్నులు అట్టడుగున ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకొని వారి బాగుకు బాటలు వేసేలా విధాన రూపకల్పన చేయాలన్నారు. తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ప్రధాని మోదీ గత పదేళ్లలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత తీసుకొచ్చి, అన్ని రంగాల్లో మన దేశం ప్రపంచస్థాయి దేశాలతో పోటీపడే శక్తినిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు బలమైన బ్రాండింగ్‌ కల్పించారని కొనియాడారు. పదేళ్ల ప్రధాని కష్టాన్ని దేశానికి అనుకూలంగా మార్చుకొనే సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించి, సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ చాలా ఆసక్తితో ఉంది : వికసిత భారత్‌ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్‌ చాలా ఆసక్తితో ఉందని చంద్రబాబు చెప్పారు. పీ-4, నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానం, నైపుణ్య గణన, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తులు తయారీ గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు.

నదుల అనుసంధానం చేయాలి : రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ద్వారా జరిగిన నదుల అనుసంధాన ఫలితాన్ని ఏపీ రైతులు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మిషన్‌మోడ్‌లో స్వర్ణచతుర్భుజి ద్వారా దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చేసినట్లుగానే ఇప్పుడు నదుల అనుసంధానానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఇందుకోసం జాతీయస్థాయి రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని చెప్పారు. జలాలపరంగా భవిష్యత్​లో ఎదుర్కొనే సమస్యలనూ పరిష్కరించవచ్చన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు.

100 శాతం అమలయ్యేలా కృషి చేయాలి : గ్రామం నుంచే మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తే మనం అనుకున్న వృద్ధి రేటు సాధించగలమని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని చెప్పారు. ప్రతి అంశాన్నీ వ్యక్తి, కుటుంబం, గ్రామ, పట్టణ, నగర, రాష్ట్రస్థాయిల్లో చూసి వాటన్నింటినీ సంతృప్తికర స్థాయిలో 100 శాతం అమలయ్యేలా కృషి చేయాలని చంద్రబాబు వివరించారు.

తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం భారత్‌కు ఉందన్న చంద్రబాబు అందుకోసం ప్రతి ఉత్పత్తి తయారీలో పర్‌ఫెక్షన్‌కు వెళ్లాలన్నారు. పరిశ్రమలు వస్తే ఎంత పెట్టుబడి పెడతారనే దానితోపాటు ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారనేది కూడా చూసుకోవాలని చెప్పారు. ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే అత్యుత్తమ ఉత్పత్తులను తయారుచేసి, తయారీ రంగానికి భారత్‌ను హబ్‌గా మార్చాలని చంద్రబాబు వెల్లడించారు.

Chandrababu on Viksit Bharat 2047 : హరిత ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌కూ ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు వనరులను సద్వినియోగం చేసుకుంటే అది సాధ్యమేనన్నారు. అధిక జనాభాను బలహీనతగా కాకుండా బలంగా మలుచుకోవడానికి డెమోగ్రఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాలని సూచించారు. దేశానికి యువత అతి పెద్ద వనరని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. దేశ మానవ, సహజవనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే 50 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనేది అసాధ్యమేమీ కాదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

నీతి ఆయోగ్‌ భేటీ - 'వికసిత్‌ ఏపీ 2047' అంశాలు ప్రస్తావించిన చంద్రబాబు - chandrababu in Niti Aayog

వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు పెరిగాయి - పోలవరం నాశనమైంది: చంద్రబాబు - CM Chandrababu on Polavaram Project

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.