HIDEN CEMERA STORY : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం వెనుక కథ మరో మలుపు తీసుకుంది. ఈ అంశంపై విద్యార్ధినులు అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహంలోని బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉంచారంటూ, సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. అసలు కథ ఇదీ..
- కృష్ణ-లిల్లీ ప్రేమికులు
- భారు- మంజు అన్నా చెల్లెళ్లు
- భారు-కృష్ణ స్నేహితులు
- జస్సు అనే వాడు లిల్లీకి వన్ సైడ్ లవర్.
ఈ ఐదుగురు విద్యార్థుల కథలో వచ్చిన మలుపులే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీశాయి. కృష్ణ-లిల్లీలు ప్రేమలో ఉండి వీడియోకాల్స్ మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఈ విషయం కృష్ణ స్నేహితుడు భారుకు తెలిసింది. స్నేహితులు కావటంతో కృష్ణ భారు తరచూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. అక్కడ భారు చెల్లెలు మంజు పరిచయం అవటం ఆమెతోనూ ప్రేమ వ్యవహారం నడిపాడు. లిల్లీ తరహాలోనే వీడియో కాల్స్ - స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ - మంజు మధ్య కూడా సాగింది. ఫలితంగా స్నేహితులైన భారు- కృష్ణ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాటా మాట పెరిగి లిల్లీతో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్ లు బయటపెడతా అని భారు కృష్ణని బెదిరించాడు. దీంతో కృష్ణ నీ చెల్లెలి వీడియో కాల్స్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయ్ అవి నేనూ బయటపెడతా అనటంతో వివాదం ముదిరింది. వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయితీకి వెళ్లింది. వన్ సైడ్ లవర్ అయిన జస్సు కోపంతో హిడెన్ కెమెరాలు అంటూ కళాశాలలో ప్రచారం చేశాడు. దీంతో వ్యవహారం గోల గోల అయింది.
నోట్ : విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాస్తవ పేర్లను ఇక్కడ మార్చి రాయడం జరిగింది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ గంగాధర్ తెలిపారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. విచారణ పురోగతిలో ఉందని, విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పుచేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
అసత్య ప్రచారంతో ఆగమాగం : గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని, అక్కడ తీసిన వీడియోలను క్యాంపస్‌లోని చాలా మంది అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ జస్సు అసత్య ప్రచారం మొదలు పెట్టాడు. అలా కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలున్నాయన్న ప్రచారంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇలా ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఈ వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసలు కథ ఇదన్న మాట.
రూమ్‌లో ఉన్న స్పై కెమెరాలను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
Secret Camera in Girls Room : ఇంటి ఓనర్ పాడుపని.. అమ్మాయిల గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి..!