ETV Bharat / state

మంచిరోజులొచ్చాయ్​ - గుంతల రోడ్లకు మరమ్మతులు

మిషన్‌ పాట్‌హోల్‌ ఫ్రీ ఏపీ కార్యక్రమం - శనివారం విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Start Mission Pothole Free AP Program
CM Chandrababu Start Mission Pothole Free AP Program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 7:54 PM IST

CM Chandrababu Start Mission Pothole Free AP Program : రాష్ట్రవ్యాప్తంగా గోతులు పడిన రహదారుల మరమ్మతులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మిషన్‌ పాట్‌హోల్‌ ఫ్రీ ఏపీ కార్యక్రమం (Mission Pothole Free AP Program)ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.

రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.350 కోట్లు మంజూరు చేసినట్టు బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు మరో రూ.220 కోట్ల మేర రాష్ట్ర విపత్తుల నిధి నుంచి కూడా నిధులు వచ్చాయన్నారు. గతంలో కాంట్రాక్టర్లకు పెట్టిన పెండింగ్ బిల్లులు కూడా చెల్లించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ మోడ్​లో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేపడతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 290 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా రోడ్ల మరమ్మతులను శనివారం నుంచే పనులు మొదలు పెడుతున్నట్టు మంత్రి వివరించారు. రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్వం లేకుండా చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు.

ఈ రూట్​లో వెళ్తున్నారా? - గోతుల్లో రోడ్డు వెతుక్కోవాల్సిందే

రోడ్ల మరమ్మతులు పూర్తైన తర్వాత సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి గుంతల రహిత రోడ్ల సర్టిఫికెట్లు జారీ చేస్తారని మంత్రి అన్నారు. నిరంతరం అధికారులు పర్యవేక్షణలో కొనసాగేలా ఆదేశాలిచ్చామన్నారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో గతుకులతో కూడిన రోడ్లపైనే ప్రజలు అవస్థలు పడ్డారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంతో పాటు మరమ్మతుల్లో అధునాతన విధానాలను అవలంబించేందుకు తిరుపతి ఐఐటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తదితర సంస్థల భాగస్వామ్యంతో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్​ అందుతుంది'

రహదారుల నిర్మాణానికి పీపీపీ విధానంతో పాటు రోడ్ అసెట్ మేనేజ్​మెంట్ సిస్టంను కూడా ప్రవేశపెట్టేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు కూడా వేగంగా నిర్మాణంలో ఉన్నాయన్నారు. 129 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి 3,300 కిలోమీటర్ల మేర హైవే పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా రూ. 76 వేల కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు అదనంగా మరో 30 వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చే అవకాశముందని అన్నారు.

ఆ 13 కిలో మీటర్ల దూరం ప్రయాణం ప్రాణాలకే ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.