CM Chandrababu Review Four Departments : సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ మహిళా శిశుసంక్షేమం, విద్యుత్, ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత మహిళా శిశుసంక్షేమంపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే పిల్లల సంరక్షణ కార్యక్రమాలపై చంద్రబాబు చర్చిస్తున్నారు.
CBN Review Women and Child Welfare Department : గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ సమీక్షకు మంత్రి సంధ్యారాణి, మహిళా శిశుసంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం విద్యుత్ ఎక్సైజ్, పౌర సరఫరాల శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. శాఖల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
డోలీ మోతలు కనిపించకూడదు - గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలపై సీఎం సమీక్ష - CM Review on Welfare Issues