ETV Bharat / state

మీ కష్టాలు చూసి చలించిపోయా - పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ - CM Chandrababu Open Letter

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:45 AM IST

CM Chandrababu Open Letter to Pensioners: పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న సీఎం, మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యమని, మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో మీ కష్టాలు చూసి చలించిపోయానని, అందుకే ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

CM Chandrababu Open Letter
CM Chandrababu Open Letter (ETV Bharat)

CM Chandrababu Open Letter to Pensioners: ఎన్నికల చెప్పినట్లుగా పెన్షనర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టకోవడం సంతోషంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆనందాన్ని వారికి బహిరంగ లేఖ ద్వారా పంచుకున్నారు. జూలై 1న ఇళ్ల వద్దే పింఛను ఇచ్చే కార్యక్రమాన్ని అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం, ఈమేరకు తన భావాలను లేఖ ద్వారా పంచుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని చంద్రబాబు తేలచ్చిచెప్పారు.

ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తమ ప్రభుత్వ తక్షణ, ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనుదారులకు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టంచేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 పెంచి ఇకపై 4000 ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu Open Letter to Pensioners
CM Chandrababu Open Letter to Pensioners (ETV Bharat)

'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security

ప్రజా శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం: దివ్యాంగులకు 3000 పెంచి ఇక నుంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతున్నా ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు.

ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం ప్రజలను పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని ఆరోపించారు. ఆ మూడు నెలల పాటు వారు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి తాను చలించిపోయానని అన్నారు. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చానని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి పింఛనుదారులకు అందిస్తున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on the Polavaram

మూడు నెలలకు పెంచిన 3000, జులై నెల పింఛన్ 4000 కలిపి మొత్తం 7000 వారి ఇంటికి తెచ్చి ఇస్తున్నామన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై పింఛనుదారుల ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. పెరిగిన పింఛనుతో ప్రజలకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. ప్రజా భద్రత తమ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చంద్రబాబు ఆకాంక్షించారు.

'పేదరికం లేని సమాజమే లక్ష్యం'- ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన - CM Chandrababu Kuppam Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.