ETV Bharat / state

'భారత జట్టు చరిత్రను తిరగరాసింది'- రోహిత్ సేనకు చంద్రబాబు, పవన్ అభినందనలు - Congratulations to Team India - CONGRATULATIONS TO TEAM INDIA

CM Chandrababu Congratulations to Indian Cricket Team: 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచకప్‌ క్రికెట్‌లో భారత్ జగజ్జేతగా నిలవడంపై భారత జట్టును గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్​ అభినందనలతో ముంచెత్తారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జాతీయ పతాకాలను పట్టుకొని జై భారత్ అంటూ యువత నినాదాలు చేశారు.

CM Chandrababu Congratulations to Indian Cricket Team
CM Chandrababu Congratulations to Indian Cricket Team (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 7:13 AM IST

Updated : Jun 30, 2024, 9:06 AM IST

CM Chandrababu Congratulations to Indian Cricket Team : టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్టును గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్​ అభినందనలతో ముంచెత్తారు. భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను తిరగరాసిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను కలను రోహిత్ సేన సాకారం చేసిందని ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తినందుకు అందరికీ అభినందనలు తెలిపారు.

17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్​ - T20 WORLD CUP 2024 FINAL

ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి : టీ20 ప్రపంచ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్​లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు.

సూర్య కుమార్ యాదవ్ క్యాచ్‌తో మ్యాచ్​ను మలుపు తిప్పారు : భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తీరు అద్భుత మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. రోహిత్ సేన ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. సూర్య కుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్​ను మలుపు తిప్పారని లోకేశ్ అభినందించారు. టీం ఇండియాను చూసి దేశం గర్విస్తోందంటూ ట్వీట్‌ చేశారు.

మన దేశం మొత్తానికీ గర్వకారణం : టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందించారు. రోహిత్‌శర్మ సారథ్యంలో భారత్‌ అద్భుత విజయం సాధించిందని, ఈ విజయం మన దేశం మొత్తానికీ గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో భారత జట్టు మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

కోహ్లీ షాకింగ్ డెసిషన్ - T20 ఫార్మాట్​కు రిటైర్మెంట్​

జనం రోడ్లపైకి వచ్చి సందడి : పొట్టి ప్రపంచకప్‌ క్రికెట్‌లో భారత్ జగజ్జేతగా నిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జనం రోడ్లపైకి వచ్చిన సందడి చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్‌ రోడ్డులో బాణాసంచా కాల్చి యువతీ, యువకులు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు చేతబట్టుకుని కేరింతలు కొట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

జై భారత్ అంటూ నినాదాలు : టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించడంతో ఏలూరులో క్రికెట్ అభిమానులు, యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని చెప్పలేనంత ఆనందంతో కేరింతలు కొడుతూ, జాతీయ పతాకాలను పట్టుకొని జై భారత్ అంటూ నినాదాలు చేశారు. యువత బైక్ విన్యాసాలు చేస్తూ, భారీగా బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

దంచికొట్టిన విరాట్, అక్షర్- సౌతాఫ్రికా టార్గెట్​ 177 - T20 World Cup 2024

Last Updated : Jun 30, 2024, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.