ETV Bharat / state

ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్‌ అందాలి - విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం - Chandrababu Review on Pensions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Chandrababu Review on Pensions : రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్‌ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు. ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఇలాంటి వాటిని గుర్తించి అనర్హులని ఏరివేసి, అర్హులకే పింఛన్‌ ఇచ్చేలా గ్రామ సభల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో 30 ఎకరాల్లో రూ.200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Chandrababu Review on Pensions
Chandrababu Review on Pensions (ETV Bharat)

Chandrababu Key Comments on Pensions : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి సవితతో పాటు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్‌ రూ.3000ల నుంచి ఒకేసారి రూ.6000లకు పెంచామన్నారు. దీర్ఘకాలిక ఆనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా రూ.15,000ల పెన్షన్ ఇస్తున్నామని చంద్రబాబు గుర్తుచేశారు.

అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్‌ అందకుండా ఉండటానికి వీళ్లేదని చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు ధ్రువపత్రాలతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి. అర్హులకు, బాధితులకు పింఛన్‌ ఇవ్వాలన్నది తమ విధానమని చెప్పారు. దాన్ని దుర్వినియోగం చేసి పెన్షన్లు పొందడం సరికాదన్నారు.

అనర్హులను తొలగించాలి : ఈ క్రమంలోనే వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్దతిలో పెన్షన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని స్పష్టం చేశారు. పింఛన్ల అంశంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అనర్హులు దివ్యాంగుల పేరుతో పింఛన్‌ పొందడం అంటే అర్హులకు అన్యాయం చేయడమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో రాజీపడమని అదే సమయంలో బోగస్‌ పింఛన్లను కొనసాగించని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండే వృద్ధులకు పింఛన్లతో సామాజిక భద్రతతో పాటు గౌరవం ఇచ్చామని సీఎం తెలిపారు. వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఏయే కార్యక్రమాలు చేయవచ్చో అధ్యయనం చేయాలని సూచించారు. డిజిటల్ లిటిరసీ ద్వారా సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని చెప్పారు. దీని కోసం ఏజెన్సీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Chandrababu on Ineligible Pensions : దివ్యాంగుల కోసం స్పోర్ట్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్లతో ఈ సెంటర్‌ మంజూరు చేసిందని చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. వీల్‌ఛైర్స్‌, ట్రై సైకిల్స్‌ సోలార్‌ సిస్టమ్‌తో నడిచే విధంగా రూపొందించాలని సూచించారు. సింగిల్‌గా ఉండే ట్రాన్స్‌జెండర్స్‌కు రేషన్‌ కార్డులు ఇవ్వాలని పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు కనిపెట్టేందుకు పరీక్షలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ - అమరావతిలో లా కాలేజీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు - Chandrababu Review Meetings

మూడేళ్లలో 95 లక్షల ఇళ్లకు సురక్షిత నీరు: సీఎం చంద్రబాబు - CM CBN Review on Jaljeevan Mission

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.