ETV Bharat / state

సంకల్పం కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు: సీఎం చంద్రబాబు - TRIBUTE TO POTTI SRIRAMULU

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం - కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ - పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు

TRIBUTE_TO_POTTI_SRIRAMULU
TRIBUTE TO POTTI SRIRAMULU (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2024, 4:05 PM IST

TRIBUTE TO POTTI SRIRAMULU: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయనను భావితరాలు గుర్తించుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు సామాజికవాది, మానవతావాదిగా చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రం ఇస్తే బాగుండేదని చెప్పారు. పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్​లోనూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామని చెప్పారు.

అమరజీవి, ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతోపాటు, సర్దార్ వల్లభాయ్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కొద్దిమంది మాత్రమే జాతి కోసం ఆలోచిస్తారని, అలాంటివారు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఒకపూట తినకపోతే ఇబ్బంది పడతామని, అలాంటిది 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. శ్రీరాములు పాడె మోయడానికి ఎవరూరాని దయనీయ పరిస్థితి ఏర్పడిందని, టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటశాల వంటివారు ముందుకు వచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో చివరకు 11 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా హైదరాబాద్​లో తెలుగు యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పారు.

సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన - ప్రాజెక్టు వర్క్‌ షెడ్యూల్​ ప్రకటన

పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ: టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాకు తామే పొట్టి శ్రీరాములు పేరు పెట్టామని చంద్రబాబు చెప్పారు. పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలోనూ త్వరలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతిబాటలో పయనింపజేస్తున్నామని 2047 స్వర్ణాంధ్ర విజన్ ఇందుకు ఉదాహరణగా చెప్పారు. కొంతమంది నాయకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, విభజన కంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శించారు.

త్వరలో వాట్సాప్ గవర్నెన్స్: వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో మన పరపతి పెరిగింది కాబట్టి ఇబ్బందులు తగ్గాయని గుర్తు చేశారు. మహానుభావులను గుర్తించుకోవడం ఎంత అవసరమో కొందరు చెడ్డవారిని గుర్తుంచుకోవడం అంతే అవసరమని చెప్పారు. 2025 మార్చిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ప్రారంభం అవుతుందని, ఈ వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్​ను తీసుకొస్తున్నామని, సమస్యను వాట్సాప్​లో పెడితే వెంటనే పరిష్కరించి మళ్లీ వాట్సాప్​లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

'క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి'

శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడు: అంతకుముందు సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి ఉనికిని తెచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని ప్రశంసించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ప్రత్యేకత మరింత తెలిసిందన్నారు. శ్రీరాములు ఓ కులానికి నాయకుడు కాదని, ఆంధ్ర జాతికి నాయకుడని కొనియాడారు. తెలుగుజాతి అప్పట్లో వివక్ష ఎదుర్కొందని, ఆంధ్రులమని ఈరోజు చెప్పుకుంటున్నామంటే ఆ గొప్పతనం పొట్టి శ్రీరాములదేనని చెప్పారు.

శ్రీరాములు త్యాగం, బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తించుకుంటూ ఆయన ఖ్యాతిని మరింత ఇనుమడింప జేయాలని కోరారు. విజన్-2047తో చంద్రబాబు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే అదే పొట్టి శ్రీరాములుకు మనం ఇచ్చే ఘన నివాళి అంటూ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సభ అనంతరం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు వారసులను సీఎం, డిప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు.

2047 నాటికి ఏపీ నంబర్‌ వన్ - స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్​ను ఆవిష్కరించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.