ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించే గణేశ ఉత్సవాల్లో పర్యావరణ హితాన్ని మరువకూడదని నిపుణులు, విశ్లేషకులు పలు సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే...
మట్టి గణనాథుడే పర్యావరణానికి హితం
- పర్యావరణానికి హాని చేయవు.
- నిమజ్జనం తర్వాత సులువుగా నీటిలో కరిగి పోతాయి.
- ప్రకృతి, జీవరాశులతో మన బంధాన్ని పటిష్టం చేస్తాయి.
మట్టి గణపతి విగ్రహాలతో సవాళ్లు
- మట్టి సేకరణ, సహజ రంగుల తయారీ కష్టతరమైనది.
- సులువుగా విరిగే ఆస్కారం ఉంటుంది. రవాణా సమస్యలు ఎక్కువ.
- తయారీదారులు చాలా తక్కువ.
- ధర ఎక్కువ. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అందుబాటులో లేవు.
- పెద్ద విగ్రహాలు లభించవు. లభించినా ధరలు ఆకాశంలో ఉంటాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో నష్టాలు
- జిప్సంను 250 నుంచి 300 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేస్తారు. ఇది నీళ్లలో కలిశాక తిరిగి జిప్సంగా మారుతుంది. హానికర పరిస్థితులను సృష్టిస్తుంది.
- ఈ రసాయనాలతో ఆక్సిజన్ శాతం చాలా మేరకు తగ్గిపోతుంది. నీటిలోని చేపలు, ఇతర జలచరాలకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. నీటిలోని మొక్కలు కూడా చనిపోతాయి.
- వీటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల్లో, వేసే రంగుల్లో సల్ఫర్, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, మెగ్నీషియం లాంటి భార లోహాలు ఉంటాయి. ఇవి నాడీ సంబంధ వ్యాధులు, పలురకాల క్యాన్సర్‌కు కారణమవుతాయి.
- భార లోహాలతో నీరు కలుషితమై ఆహార గొలుసు ద్వారా తిరిగి మనుషుల శరీరంలోకి చేరతాయి.
- వీటిలోని ప్రమాదకర రసాయనాలు వివిధ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల జబ్బులు, చర్మవ్యాధులు, రక్త, కంటి సమస్యలకు దారి తీస్తాయి. వివిధ రకాల అలర్జీలకు కారణమవుతాయి. కొత్త కొత్త వ్యాధులను సంక్రమింపజేస్తాయి.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల అనుకూలతలు
- తక్కువ బరువు ఉంటాయి.
- భారీ సైజువి తయారీకి, రవాణాకు అనువుగా ఉంటాయి
- కావాల్సిన శైలితో సులువుగా తయారు చేయవచ్చు.
- మట్టి విగ్రహాలతో పోలిస్తే ధర తక్కువ.
- ఎక్కువ హంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అవగాహణ కల్పించాలంటే..
- మట్టి గణపతులతో కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.
- ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతుల వాడకాన్ని పెంపొందించాలి.
- పర్యావరణానికి హానికారక పదార్థాల వినియోగంపై ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయాలి.
- తాగునీటికి ఉపయోగించే, జలచరాలు ఉంటే వాగులు, కుంటలు, చెరువుల్లో నిమజ్జనం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సిబ్బంది కఠినంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి