Citizens for Democracy Meeting in Kurnool: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని త్రిగుణ క్లార్క్స్ ఇన్ హాలులో 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం' నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఛైర్మన్ భవాని ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పాలంకి సుబ్బరాయన్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్న 36 పౌర సమాజ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
'ఏపీలో త్వరలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది'- 'ఓటు వేద్దాం- ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేద్దాం'
ఓటు ప్రాధాన్యత, వినియోగం వంటి అంశాలపై పలువురు నిపుణులు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలనే విషయంపై కూలంకషంగా వివరించారు. రాష్ట్రంలో సుపరిపాలన కోరుకునే ఓటర్లందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడం కీలకమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లలో నెలకొన్న ఆనాసక్తి ధోరణి పోగొట్టాల్సిన అవసరం ఉందని, దీనికి పౌర సమాజ సంస్థలు గట్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజా జీవితంలో మార్పులు తెచ్చేందుకు ఇతర సంస్థలతో కలిసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తోందని దీనికి పౌర సమాజం స్పందించి సహకరించాలని అన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న తరుణంలో పౌరులందరూ క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు.
పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ
ప్రజాసేవకు అంకితమైన మనుషులు, నిజాయతీగల వ్యక్తులు సమాజంలో ఉండబట్టే నీతిమంతులైన అధికారులు వ్యవస్థలో ఉండబట్టే సమాజం నడుస్తోంది. దేశం ముందుకు వెళ్తోంది. కానీ, రాను రాను ఇలాంటి వ్యక్తులు తగ్గిపోతున్నారు. పౌరుల భాద్యతను మనం గుర్తు చేస్తే డబ్బు కోసమో మద్యం కోసమో లేదా తాత్కాలిక లాభం కోసమో వ్యవస్థకు రాజీ పడే పరిస్థితి కాకుండా చూస్తే వ్యవస్థ తప్పకుండా మారుతుంది. ఎన్నికలు అనగానే కాయగూరల బేరం కాదు ప్రజల కోసం ప్రజలు చేసే యజ్ఞం అనే విషయాన్ని గుర్తు చేయాలి అనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.- భవాని ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ ఛైర్మన్
'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర'పై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల సమావేశం
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డవారిపై కంటితుడుపు చర్యలు ప్రభావం చూపబోవు ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు జరిగిన వెంటనే ప్రతిస్పందన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, CFD కార్యదర్శి
మనం ఎంపిక చేసుకున్న ఈ ప్రజాస్వామ్య విధానంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల కాలానికి మన పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఆ తరువాత మనల్ని పట్టించుకునే వారు కూడా ఉండరు. ఈ మధ్య కాలంలో చనిపోయిన వారికి కూడా ఓట్లు ఉంటున్నాయి. కానీ, దీని గురించి ఏక్కడా ఆలోచన చేయట్లేదు. మనం ఎన్నుకున్న నాయకులు ఐదు సంవత్సరాల కాలంలో వారు మన దగ్గరకు రారు. మనం వారి దగ్గరకు వెళ్తే వారు పట్టించుకోరు.- ఎల్‌వీ సుబ్రమణ్యం, విశ్రాంత ఐఏఎస్
సదస్సులో చర్చించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు చేపడతామని హాజరైన ప్రముఖులు తెలిపారు.