ETV Bharat / state

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - Cid Raids At Vasudeva Reddy House - CID RAIDS AT VASUDEVA REDDY HOUSE

CID Raids at Vasudeva Reddy House : ఏపీ బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డే ముందుండి నడిపించారని ఆరోపణలున్నాయి.

CID Raids at Vasudeva Reddy House
CID Raids at Vasudeva Reddy House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 4:19 PM IST

CID Raids at Vasudeva Reddy House : ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారని ఆయనపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి.

నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు అనుచిత లబ్ధి కలిగించేలా వాసుదేవరెడ్డి వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీలో జే-బ్రాండ్‌ మద్యం తీసుకురావడంతో పాటు డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయనదే కీలకపాత్ర. జే-బ్రాండ్‌ మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదేనని పలు ఆరోపణలు ఉన్నాయి.

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు (ETV Bharat)

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

నారాయణకు చెందిన సంస్థల్లో ముగిసిన ఏపీ సీఐడీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.