CID Officials Investigating Liquor Purchase Order Scam in AP : జగన్ ప్రభుత్వ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్ల కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్లు చివరికి ఎవరికి చేరాయి? అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దానిపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. అస్మదీయ సంస్థలు, అడిగినంత కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే 90 శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం, వాటికి చెల్లించిన బేసిక్ ప్రైస్ పెంచేయడం ద్వారా దోచుకున్న సొత్తు ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై సమాచారం సంపాదించింది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్, డిస్టలరీస్, బ్రూవరీస్ విభాగాల కార్యాలయాల్లో గత మూడు రోజులుగా సీఐడీ దర్యాప్తు బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు ముగిశాయి.
ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ కార్యాలయంలో సీఐడీ సోదాలు - పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ఏపీఎస్‌బీసీఎల్ (APSBCL) పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి వినియోగించిన కంప్యూటర్, ఇతర విభాగాల్లోని సిస్టమ్స్‌ని జల్లెడ పట్టిన సీఐడీ బృందాలు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటి నుంచి ప్రాథమికంగా సేకరించిన ఆధారాల మేరకు అనుచిత లబ్ధి పొందిన సంస్థల వెనక నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించాయి. వారందరికీ నోటీసులిచ్చి విచారించాలని సీఐడీ భావిస్తోంది. మరోవైపు తాజా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను విభజించి ఫోరెన్సిక్, డిజిటల్, ఫైనాన్షియల్ ఆడిట్‌కి పంపించాలని నిర్ణయించింది. మొత్తం కుంభకోణం విలువ తేల్చడానికి అధికారికంగా ఏపీఎస్‌బీసీఎల్ నుంచి ఏయే ఖాతాల్లోకి నిధులు వెళ్లాయి? అవి కాకుండా అనధికారికంగా ఎంత చెల్లించారు అనేది నిర్దారించనుంది.
'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks
వైఎస్సార్సీపీ లిక్కర్ స్కాం అప్డేట్ - అస్మదీయులకే మద్యం ఆర్డర్లు - CID Inquiry on YSRCP Liquor Scam