ETV Bharat / state

ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం - నెక్సస్‌ గ్రోత్‌ సంస్థకు సీఐడీ నోటీసులు

నెక్సస్‌ సంస్థతో నరేష్‌ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన సీఐడీ - ఖాతాదారుల డబ్బు కాజేసి నెక్సస్‌ గ్రోత్‌లో పెట్టుబడి పెట్టిన నరేష్‌ బృందం

ICICI_BANK_Scam
ICICI BANK Scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

ICICI BANK Scam: ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి బెజవాడలో సీఐడీ బృందం సోదాలు నిర్వహించింది. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును గతంలో మేనేజర్‌గా ఉన్న నరేష్ టీం పెట్టుబడిగా పెట్టి ప్రారంభించిన నెక్సస్‌ గ్రోత్‌ (NEXUS GROWTH) సంస్థకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. నరేష్ ఖాతా నుంచి పలు లావాదేవీలు నెక్సస్ సంస్థలో ఉన్నట్టు గుర్తించామని నోటీసులో పేర్కొంది. సంస్థను ప్రారంభించిన ప్రభు కిషోర్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

నరేష్‌ కాజేసిన సొమ్ముతో ప్రభుకిశోర్‌ అనే వ్యక్తి నెక్సస్‌ గ్రోత్‌ ఏర్పాటు చేశాడు. ప్రభుకిశోర్‌, కిరణ్‌, అజిత్‌ సింగ్‌తో నరేష్‌ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దీంతో ప్రభు కిషోర్​తో పాటు నరేష్ లావాదేవీలు నడిపిన కిరణ్, అజిత్ సింగ్ నుంచి కూడా సీఐడీ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో 3 సీఐడీ బృందాలు సోదాలు చేపట్టాయి. బెజవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట బ్రాంచిలలో వివరాలను సేకరించారు.

72 ఖాతాల నుంచి రూ.28 కోట్లు దారి మళ్లింపు - సీఐడీ విచారణ

అసలేం జరిగిదంటే : పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతినగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్​ బ్రాంచ్‌ల్లో గతంలో మేనేజర్‌గా ఉన్న నరేష్​ ఖాతాదారులను నట్టేట ముంచాడు. ఖాతాదారుల నుంచి 28 కోట్ల రూపాయలు కొట్టేశాడు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి కోట్ల రూపాయల నగదును కొల్లగొట్టాడు. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఫిక్స్​డ్ డిపాజిట్లలో ఉన్న నగదును సైతం మాయం చేశాడు. రెండు నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో బాధితులు బ్యాంకుకు వెళ్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నరేష్ చేసిన మోసాలపై జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాంకులో సిబ్బందితో పాటు ఖాతాదారులను సీఐడీ అధికారులు ఇప్పటికే విచారించారు. వీటన్నింటి నడుమ, నరేష్​ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని పేర్కొంటూ, ఈ స్కామ్​లో ఉన్న వారి గురించి సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. దీంతో కేసు విషయంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. మరోవైపు బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ బాధిత ఖాతాదారులకు ఊరట - నగదు వెనక్కి ఇచ్చే ప్రక్రియ స్టార్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.