ETV Bharat / state

మ్యాజిక్ కెమెరా - 10 సెకన్లలో అరచేతికి ఫొటో కాపీ - MAGIC CAMERA IN DRONE SUMMIT

అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఆకర్షణగా మ్యాజిక్ కెమెరా

Magic Camera in Drone Summit
Magic Camera in Drone Summit (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 2:34 PM IST

Magic Camera in Drone Summit : ఫొటోలు జీవితంలో భాగమైపోయాయి. సందర్భం ఏదైనా క్షణాలను బంధించేయాల్సిందే. మొబైల్‌లో ఫొటో తీసుకుంటే స్క్రీన్​పై మాత్రమే చూడగలం. అదే చిత్రం సెకన్లలో చేతికి వస్తే వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదూ! ఇలాంటి పరికరమే అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌లో దర్శనమిచ్చింది. అద్దంలా ఉండే బాక్సు ముందు నిల్చుంటే చాలు 10 సెకన్లలో ఫొటో కాపీ అరచేతిలో ఉంటుంది. ఆ మ్యాజిక్ కెమెరా ఎలా పని చేస్తుంది దాని విశేషాలేంటో చూసేద్దాం రండి.

రెండ్రోజులపాటు జరిగిన అమరావతి డ్రోన్ సమ్మిట్ వినూత్న ఆలోచనల ప్రదర్శనకు వేదికైంది. డ్రోన్ సమ్మిట్​కు అనేక రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు వచ్చారు. వేల మంది ప్రజలు తరలివచ్చారు. డ్రోన్ షో, విభిన్న రకాల డ్రోన్ విన్యాసాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆనంద క్షణాలను వారికి జీవితాంతం పదిలంగా ఉంచేలా నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. దానికోసం సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. అదే మ్యాజిక్ కెమెరా.

10 సెకన్లలో అరచేతికి ఫొటో కాపీ : అద్దం బాక్సులా కనిపిస్తున్నదే మ్యాజిక్ ఫొటో కెమెరా. బాక్సు ఎదురుగా నిల్చుంటే చాలు స్మైల్ ప్లీజ్ అంటూ ఫొటో తీసి 10 సెకన్లలో కాపీ చేతికొస్తోంది. ఫొటోను ఫ్రేమ్‌లో పెట్టి మరీ ఉచితంగా అందించి ఆకట్టుకున్నారు. డ్రోన్ ప్రదర్శనలు చూసేందుకు వచ్చిన వారంతా మ్యాజిక్ కెమెరా వద్ద చిత్రాలు దిగేందుకు పోటీపడ్డారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఫొటో దిగుతూ హర్షం వ్యక్తం చేశారు.

బాక్సులో కెమెరాను అమర్చి టైమర్‌ను సెట్ చేసి స్క్రీన్​పై టచ్ చేస్తే చాలు హావభావాలను పట్టేస్తుంది. గంటకు ఎన్ని చిత్రాలు తీయొచ్చు మ్యాజిక్ కెమెరా పూర్తి పని తీరును ఫొటోగ్రాపర్ మాటల్లోనే విందాం. సమ్మిట్​లో అత్యాధునిక డ్రోన్లు చూడటం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ మ్యాజిక్ ఫొటో కెమెరాతో ఫొటోషూట్ చేయటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

"డ్రోన్ సమ్మిట్ చాలా బాగుంది. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. 5500 డ్రోన్లతో షో చాలా బాగుంది. ఫొటో సెక్షన్​ కూడా బాగుంది. మ్యాజిక్ కెమెరాలో ఫొటో రావడం చాలా కొత్తగా అనిపించింది. 10 సెకన్లలో కాపీ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఫొటోను ఫ్రేమ్‌లో పెట్టి మరీ ఉచితంగా అందించారు." - సందర్శకులు

"భారత్ భవిష్యత్ బాగుండాలి - ఆ విజయంలో ఏపీ ప్రధాన పాత్ర కావాలి" - విశ్వాసం పెంచిన డ్రోన్ సమ్మిట్

'మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు - 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే రెడ్ వింగ్ డ్రోన్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.