ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతలు చేసిన తప్పు ఒప్పుకోవాలి: చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు - Chittoor District MLAs on Tirumala - CHITTOOR DISTRICT MLAS ON TIRUMALA

Chittoor District MLAs on Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ ప్రక్షాళనతో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తప్పు సమర్థించుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. భగవంతుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి, టీడీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు యత్నించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 4:37 PM IST

Updated : Sep 21, 2024, 5:06 PM IST

Chittoor District MLAs on Tirumala Laddu: తక్కువ ధరకు వస్తే చాలా! నాణ్యత చూడరా! అని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్‍, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్‍, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‍ పాల్గొన్నారు. చేసిన తప్పు సమర్థించుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. అన్నీ పరిశోధనలు చేస్తున్నామని, సాక్ష్యాలు సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు.

వైఎస్సార్సీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవాలని అన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ఎవరినీ ఉపేక్షించేది లేదని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం చాలా బాధాకరమని, ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయి పరీక్షల అనంతరమే కల్తీపై అధికారులు నిర్ధరణకు వచ్చారన్నారు. విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుమల ఆలయంలో చట్టం కన్నా ధర్మం ముఖ్యమని, ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా శ్రీవారి కార్యక్రమాలు సాగుతాయని చెప్పారు. శ్రీవారి లడ్డూను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారని, ల్యాబ్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటుంటే రాజకీయం ఆపాదిస్తారా అని మండిపడ్డారు. తప్పు జరగలేదనే నమ్మకం ఉంటే విచారణను ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు.

భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయ్‌ - స్వామివారికి అపచారం తలపెట్టే మాటలు, చేతలు చేయం: చంద్రబాబు - Chandrababu on Tirumala Laddu

వ్యవస్థ ప్రక్షాళనలో అన్నీ బయటకొస్తాయన్న ఎమ్మెల్యేలు, ఎన్‌డీడీబీలో టెస్టులు చేశాకే నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని, అన్ని ఆలయాల్లో పరిశీలనలు జరుగుతున్నాయన్నారు. భగవంతుడికి పెట్టే నైవేద్యం కూడా అపవిత్రం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత పాలకమండలిలో పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటుపై చర్చ జరగలేదా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకున్న ఎవరినీ వదిలిపెట్టమన్నారు. తిరుమల ఆలయాన్ని శుద్ధి చేయాలనే భక్తుల డిమాండ్ సరైనదేనని అన్నారు. ఆలయ పవిత్రతను వైఎస్సార్సీపీ రాజకీయాలకు వాడుకుందని ధ్వజమెత్తారు.

తిరుమలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారని, లడ్డూ అపవిత్రంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆధారాలతోనే మాట్లాడారన్నారు. గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసేవారని, అది మూతపడ్డాక నందిని నెయ్యి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమలను వైఎస్సార్సీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. గత ఈవో ధర్మారెడ్డి దిల్లీలో లాబీయింగ్ కోసం ఆలయ పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు.

ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో ఉంది - లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం - Prelates about Tirumala Laddu Issue

Last Updated : Sep 21, 2024, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.