ETV Bharat / state

రచ్చ గెలిచి, ఇంట గెలిచాను - మీ అందరికీ రుణపడి ఉంటా : చిరంజీవి ఎమోషనల్ - ANR NATIONAL AWARD IN HYDERABAD

ఘనంగా ఏఎన్నార్ శత జయంతి వేడుకలు - ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్ - ఇంట గెలిచా, రచ్చ గెలిచా అంటూ చిరంజీవి ఎమోషనల్

MEGASTAR CHIRANJEEVI
ANR NATIONAL AWARD EVENT IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 12:28 PM IST

Updated : Oct 29, 2024, 12:48 PM IST

ANR Award Function at Hyderabad : అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా వారి పేరు మీద ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఏఎన్నార్​ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని మెగాస్టార్​ చిరంజీవి తెలిపారు. అవార్డు అందుకున్న సందర్భంలో మెగాస్టార్​ ఎమోషనల్​ అయ్యారు. తన చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు ప్రదానం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్ పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం (అక్టోబర్ 28) నిర్వహించిన ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఘనంగా జరిగిన ఈ వేడుక గురించి ఎక్స్​ వేదికగా పోస్ట్‌ చేశారు. చిరంజీవి, నాగార్జునలతో దిగిన ఫొటోను షేర్ చేశారు.

ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా వారి కుటుంబంలోని, చిత్ర పరిశ్రమలోని వ్యక్తిగా ఆయనకు నివాళులర్పించాను. ఇది భావోద్వేగాలతో కూడిన సాయంత్రం. ఇంత గొప్ప వేడుకలో నన్ను భాగం చేసినందుకు హీరో నాగార్జునకు ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవికి నా చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని అమితాబ్‌ పేర్కొన్నారు.

రుణపడి ఉంటా : ఇక ఈ అవార్డు వేడుకపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్‌ చేశారు. 'అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా వారి పేరు మీద ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ అందుకోవడం సంతోషంగా ఉంది. నా గురువు అమితాబ్‌ చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ, అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సభ్యులకు, నా మిత్రుడు, సోదరుడు సుబ్బరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినీ ప్రయాణంలో భాగమై, నా ప్రతి మైలురాయికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను' అని రాసుకొచ్చారు.

అవార్డు వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఇక ఈ అవార్డు అందుకున్న సమయంలో అమితాబ్ కాళ్లకు చిరంజీవి నమస్కారం పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్‌ బుక్‌లో స్థానం, ఇలాంటివి ఎన్ని వచ్చినా ఏఎన్నార్‌ జాతీయ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి, ఈ అవార్డు ఇవ్వడం గొప్ప విషయంగా అనిపించింది. ఈ రోజున రచ్చ గెలిచి, ఇంట గెలిచిన అనుభూతి కలిగింది అన్నారు.

శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు- ఇది ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్!

ANR అవార్డు అందుకున్న చిరంజీవి- ప్రదానం చేసిన బిగ్ బి

Last Updated : Oct 29, 2024, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.