ETV Bharat / state

హృదయ విదారకం - నిర్జీవమైన అమ్మ - 2 రోజుల పాటు జోలిలోనే రెండేళ్ల పాప - Mother committed suicide in ap - MOTHER COMMITTED SUICIDE IN AP

Child Crying at Mother Dead Body: రెండ్రోజుల పాటు ఓ చిన్నారి తల్లి మృతదేహంపై వేలాడుతూ నరకయాతన అనుభవించింది. తల్లి వీపుపై వస్త్రంలో వేలాడిన ఆ చిట్టి తల్లి ఆకలికి ఓర్చుకోలేక ఎలాగోలా కష్టపడి కిందకు దిగి రోడ్డు మీదకు ఏడుస్తూ వచ్చింది. దీంతో ఆమె తల్లి అనుమానాస్పద మృతి వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

Child Crying at Mother Dead Body
Child Crying at Mother Dead Body (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 10:36 AM IST

Child Hanging Cloth on Mother Dead Body Back in AP : అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన ఆ రెండేళ్ల చిన్నారి పొదల్లో తల్లి మృతదేహం పైనే రెండు రోజులు ఉంది. ఆకలితో ఏడుస్తున్నా అమ్మ పట్టించుకోవడం లేదు. చుట్టూ ఎవరూ కనిపించడం లేదు. దీంతో చిన్నారి రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. ఇక ఆకలి తట్టుకోలేని చిన్నారి ఎలాగో మృతదేహం పైనుంచి కిందకు వచ్చి రోడ్డు మీదకు వెళ్లింది. దీంతో ఆమె తల్లి మృతి చెందిన విషయం బయటకు తెలిసింది. ఈ దారుణమైన ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా అరకులోయ మండలం పానిరంగిని సమీపంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగుడ గ్రామానికి చెందిన పాంగి పద్మ, పద్మాపురానికి చెందిన కొండకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తెను వెంటబెట్టుకొని పద్మ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పానిరంగినిలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి బుధవారం వెళ్లింది. అక్కడ అందరితో కలిసి భోజనం కూడా చేసింది. అయితే వాళ్లంతా పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి పద్మ, ఆమె కుమార్తె కనిపించలేదు.

దీంతో పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని బంధువులు భావించారు. చివరకు శుక్రవారం ఉదయం రెండేళ్ల చిన్నారి ఏడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. దీంతో స్థానికులు ఆ పాప తల్లిదండ్రులు ఎవరు? పాప ఒక్కతే ఎలా వచ్చిందని చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని పొదల్లో ఉన్న ఓ చెట్టుకు తాడుతో వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. చుట్టుపక్కల గాలించగా ఆమె తన బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

అయితే ఆ చిన్నారి రెండు రోజుల పాటు తల్లి వీపుపై వస్త్రంలోనే వేలాడింది. తన అమ్మకు ఏం జరిగిందో తెలియదు. ఆకలితో అలాగే ఏడ్చింది. ఎంత ఏడ్చినా చుట్టూ అడవి కావడంతో ఎవరికి ఆ అరుపులు వినిపించలేదు. దీంతో ఎలాగో తల్లి వీపుపై ఉన్న వస్త్రం నుంచి కిందకు దిగి మెల్లగా ముందుకు పాకుకుంటూ వెళ్లింది. అక్కడ స్థానికుల కంట పడటంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. రెండు రోజులు అక్కడే ఉండటంతో పురుగులు, దోమలు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి తల్లి పద్మ అనుమానాస్పద మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

తన కళ్లెదుటే తల్లిదండ్రులపై దాయాదుల దాడి - చూసి తట్టుకోలేక 14 ఏళ్ల చిన్నారి మృతి - YOUNG GIRL DIED IN SURYAPET

'నా మనవడిని నా చేతులతోనే చంపుకున్నాను - దేవుడా ఎందుకిలా చేశావు' - Peddapalli Tractor Accident boy died

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.