కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Koti Womens University - CM REVANTH KOTI WOMENS UNIVERSITY
Koti Womens University Name Change : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఆమె స్ఫూర్తి అని చెప్పారు.
Published : Sep 10, 2024, 8:57 PM IST
|Updated : Sep 11, 2024, 7:09 AM IST
CM Revanth On Koti Womens University Name Change : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ధరణి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవాలనే కుట్రలను, రైతాంగ పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టామని రేవంత్ తెలిపారు.
సామాజిక వేత్త కంచె ఐలయ్య సూచించినట్లుగా హైదరాబాద్‌లోని కోఠి మహిళా యూనివర్శిటికి చాకలి ఐలమ్మ పేరు పెడుతామని హామీ ఇచ్చారు. చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఐలమ్మ కుటుంబం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. పోరాటస్ఫూర్తి కలిగిన వాళ్లు ప్రజా ప్రభుత్వానికి అవసరమని స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం భూ హక్కులను ధరణి పేరుతో లక్షల ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అలేఖ్య పుంజాల నేతృత్వంలోని చాకలి ఐలమ్మ నృత్య నాటికను అతిథులు తిలకించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తమ అందరిలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో లక్షలాది పేదవారి కుటుంబాలకు భూమి ఉందంటే ఆ భూ హక్కును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం తెలిపారు. మంత్రి వర్గ సహచరుల అనుమతితో కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో లక్షలాది పేదవారి కుటుంబాలకు భూమి ఉందంటే ఆ భూ హక్కును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ఇందిరా గాంధీ తీసుకొచ్చిన భూ సంస్కరణలను పీవీ నరసింహరావు అమలు చేశారు. ధరణి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవాలనే కుట్రలను, రైతాంగ పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టాం. ఆనాటి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్పూర్తి మా అందరిలో ఉంది. మా మంత్రివర్గ సహచరుల అనుమతితో కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాం." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది - Special Police force For Hydra