Chevella BJP MP Candidate Konda Affidavit Assets : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి మూడోసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్, 2019లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన విశ్వేశ్వర్ రెడ్డి, ఈసారి బీజేపీ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్‌కు నామినేషన్ దాఖలు చేశారు. 2014లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో చేవెళ్ల ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పలు కారణాలతో పార్టీని వీడారు. బీజేపీలో చేరిన ఆయనకు మూడోసారి చేవెళ్ల టికెట్ ఇవ్వడంతో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను కొండా పేర్కొన్నారు. 2019లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌తో పోలిస్తే, గడిచిన ఐదేళ్లలో కొండా ఆస్తుల విలువ 423 శాతం పెరగడం గమనార్హం.
Konda Vishweshwar Reveals Assets : ప్రస్తుతం తనతో పాటు తన భార్య, మూడో కుమారుడి పేరుతో రూ.4,490 కోట్ల ఆస్తులున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తన పేరిట రూ.1178.72 కోట్ల ఆస్తులు, తన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3203.90 కోట్లు, మూడో కుమారుడు విరాజ్ మాదవ్ రెడ్డి పేరిట రూ.107.44 కోట్ల ఆస్తులున్నట్లు విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. తన పేరుతో ఉన్న స్థిరాస్తుల్లో వ్యవసాయ భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లు ఉంటుందని, సంగీతారెడ్డి పేరుతో రూ.5.51 కోట్లు, కుమారుడు విరాజ్ పేరుతో రూ.1.27 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
చేవెళ్ల లోక్‌సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో?
సొంత కారు లేదు కానీ వేల కోట్ల ఆస్తులు : తన పేరుతో రూ.1.76 కోట్ల అప్పులున్నాయని, తన భార్య సంగీతా రెడ్డికి రూ.12 కోట్లకు పైగా అప్పులున్నట్లు తెలిపారు. కేఏఆర్ మోటర్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.94 వేలు, చేవెళ్ల ఫామ్స్‌కు రూ.12 లక్షలు, తన కుమారుడు ఆనందిత్ రెడ్డికి రూ.కోటి 64 లక్షలు అప్పు చెల్లించాలని, అదే విధంగా తన భార్య తనకు రూ.కోటి అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన భార్య సంగీతారెడ్డికి రూ.35.82 కోట్ల వ్యక్తిగత రుణాలున్నట్లు అఫిడవిట్లో వివరించారు. తనకు సొంత కారు లేదని, నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
చేతిలో నగదు రూ.6 లక్షలు మాత్రమే ఉందని, భార్య సంగీతా రెడ్డి చేతిలో రూ.3 లక్షల 78 వేలు ఉన్నాయని తెలిపారు. రూ.60 లక్షలు విలువ చేసే 862 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్స్ ఉన్నాయని, భార్య సంగీతారెడ్డి పేరుతో రూ.10.40 కోట్ల విలువ చేసే బంగారు, డైమండ్ ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపర్చారు. 2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో రూ.895 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు ప్రకటించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రూ.35 కోట్ల ఆప్పులున్నట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో వాటి విలువ 423 శాతం పెరగడం గమనార్హం.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయాలి? అసలు అఫిడవిట్ అంటే ఏమిటి?