ETV Bharat / state

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు - Chandrababu Take Charge as CM

Chandrababu Will Take Charge as Chief Minister : సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చేలా దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్​ టైటిలింగ్​ యాక్టు రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 7:24 AM IST

Updated : Jun 13, 2024, 3:01 PM IST

cbn_charge_cm
cbn_charge_cm (ETV Bharat)

Chandrababu Will Take Charge as Chief Minister : ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతేస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ‍‍ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఛాంబర్ ను సర్వాంగ సుందరంగా అధికారులు తీర్చి దిద్దారు.

Chandrababu Will Take Charge as Chief Minister
Chandrababu Will Take Charge as Chief Minister (ETV Bharat)

నిరుద్యోగ యువతకు వరంగా డీఎస్సీ : ముఖ్యమంత్రిగా నేడు (జూన్​ 13) బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణ దస్త్రంపై చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత 2-3 రోజులుగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థల్లో 13 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం- మోదీ ఆత్మీయ ఆలింగనం - ap new cm cbn

రాకాసి చట్టానికి చెల్లుచీటీ : ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్‌ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్‌ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ పెద్దలు పావులు కదిపారు. ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు.

సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ముద్రించిన పాసుపుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు.

చంద్రబాబు, పవన్ పట్టాభిషేకంలో భావోద్వేగ సన్నివేశాలు - Family members in joy with CBN oath

పింఛను రూ.4 వేలకు పెంపు : 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛన్‌ను 5 రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని 2 వేలకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్‌ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛన్‌ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్‌ 4 వేలు, అలాగే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గాను వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం రూ. 3 వేలు కలిపి రూ. 7 వేల పింఛన్‌ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు 4 వేల రూపాయల పింఛన్‌ అందనుంది.

మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్- సామాజిక న్యాయానికి పెద్దపీట - AP New Cabinet Ministers List

పేదలకు అండగా అన్నక్యాంటీన్ల పునరాగమనం : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 31 కోట్లు ఖర్చుచేసింది. పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కేవలం తెలుగుదేశం ప్రారంభించిందన్న కక్షతో జగన్‌ మూసివేయించారు. అయినా టీడీపీ నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు.

నిరుద్యోగితను తగ్గించడంలో కీలకంగా నైపుణ్య గణన : యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు ఐదో సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ఏ రంగానికి ప్రాధాన్యముంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది.

చంద్రబాబు టీం - కొత్త మంత్రుల వివరాలు - Andhra Pradesh Ministers details

నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు - చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు (ETV Bharat)

Last Updated : Jun 13, 2024, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.