ETV Bharat / state

వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయం అందుకే రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు: చంద్రబాబు - Chandrababu Fire on YSRCP - CHANDRABABU FIRE ON YSRCP

Chandrababu Fire on YSRCP : సత్తెనపల్లిలో దివ్యాంగులు సమస్యలపై వినతిపత్రం అందించారని, వారికి నెలకు 6 వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా పింఛన్‌ నిర్ణయం తీసుకున్నానన్న చంద్రబాబు, దివ్యాంగులకు టీడీపీ తెచ్చిన పథకాలను వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. అదే విధంగా పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోతుందని తెలిసి వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టట్లేదని, అర్ధరాత్రి సమయంలో టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టారని ఆరోపించారు.

Chandrababu_on_Divyang_Pension_Increase
Chandrababu_on_Divyang_Pension_Increase
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 4:03 PM IST

Chandrababu on Handicapped Pension Increase: సత్తెనపల్లిలో దివ్యాంగులు తనని కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారని, వారి కోరికపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6 వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేసామన్నారు. దివ్యాంగుల కోసం తెలుగుదేశం అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు - Vuyyuru Praja Galam meeting

Chandrababu on Krosuru TDP Office Fire: అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టారని మండిపడ్డారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పని చేశారని దుయ్యబట్టారు. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇదే వైసీపీ వాళ్ల నైజమన్నారు. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh Tweet on TDP Office Fire: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ జన సునామీని తలపించడంతో వైసీపీ మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని తేలిపోవడంతో అర్థరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో తెలుగుదేశం కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారని దుయ్యబట్టారు. వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదని మండిపడ్డారు. దాడులు, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్రావు గుర్తించాలన్నారు.

త్వరలో వైసీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారని, క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పామర్రులో ఐటీ టవర్-రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.