ETV Bharat / state

సీఎం చంద్రబాబుతో చాగంటి కోటేశ్వరరావు భేటీ

సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన చాగంటి కోటేశ్వరరావు - విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సూచించిన సీఎం చంద్రబాబు

chaganti_met_chandrababu
chaganti_met_chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 5:30 PM IST

Chaganti Koteswara Rao met CM Chandrababu : భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్​తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని ఆ దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సీఎం చంద్రబాబును కలిసారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు చాగంటికి సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు.

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని సీఎం అన్నారు. దేశంలోని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలను ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని అన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు.

ఆర్జీవీ ఇంటికి ఏపీ పోలీసులు - అరెస్టుకు రంగం సిద్ధం!

సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేశ్​తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.

మంత్రి లోకేశ్​తో సమావేశం: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యాశాఖ మంత్రి లోకేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో లోకేశ్​తో సమావేశం అయ్యారు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని దీని కోసం అమూల్యమైన సలహాలు అవసరమని చాగంటికి లోకేశ్​ చెప్పారు. విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు తన వంతు సలహాలు, సహకారం అందిస్తానని ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.

చంద్రబాబుపై రాళ్లదాడి కేసు - మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు

విధి ఆడిన వింత నాటకం - ప్రమాదం చూసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.