CEO MK Meena on Macherla Incidents : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు సీఈవో మీనా తెలిపారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందని అన్నారు. ఘటన జరిగిన మరుసటిరోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని తెలిపారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని, ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని అన్నారు.
మొత్తం 9 చోట్ల ఈవీఏంలు ధ్వంసం అయ్యాయని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒక్క మాచర్ల లోనే 7 చోట్ల ధ్వంసం చేశారని వివరించారు. మాచర్ల లో గొడవలు జరుగుతాయనే అన్ని చోట్లా వెబ్ కాస్టింగ్ పెట్టామని తెలిపారు. కొందరు గొడవలు చేశారని, వాటిపై కేసులు నమోదు చేశామని మీనా తెలిపారు. 20 తేదీన రెంట చింతల లో కోర్టులో మెమోను పోలీసులు దాఖలు చేసారని, 10 సెక్షన్ల కింద పిన్నెల్లి పై కేసులు పెట్టామని వెల్లడించారు. ఏడేళ్ళ వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని మీనా తెలిపారు. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్ళాయని, మిగతా చోట్ల కూడా కేసులు పెట్టీ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ కొన్ని బదిలీలు చేసిందని తెలిపారు. అందుకే కొంత ఆలస్యం అయ్యిందని తెలిపారు. అదే రోజు ఈ ఘటన ను గుర్తించి పోలీసు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదు : ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని, అందువల్లనే కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని గుర్తు చేశారు. డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని అన్నారు. సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారని, ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదని అన్నారు. ఘటన జరిగిన మరుసటిరోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని తెలిపారు.
బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి- వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - Pinnelli Destroy EVM