ETV Bharat / state

వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - విపత్తు నష్టంపై ఆరా - Central Team Visit telangana

Central Team Visit Flood Affected Areas Today : రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర బృందం పర్యటించింది. మొదట సచివాలయంలో వరద వల్ల జరిగిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ తిలకించారు. అనంతరం జిల్లాలకు కేంద్రం బృందం రెండు టీంలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున విపత్తు నిర్వహణ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

Central Team Visit Flood Affected Areas Today
Central Team Visit Flood Affected Areas Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 12:46 PM IST

Updated : Sep 11, 2024, 7:50 PM IST

Central Team Visit Flood Affected Areas in Telangana : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలోని వరదప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. మొత్తం ఆరుగు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల్లో తొలిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్, ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, వ్యవసాయశాఖ నుంచి శాంతినాథ్ శివప్ప ఒక బృందంగా పర్యటించారు. రెండో బృందంలో రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ కే కుశ్వంగ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి టి నైల్ ఖాన్సూన్, ఎన్ఆర్​ఎస్​సీ నుంచి శశివర్ధన్ రెడ్డి మరో బృందంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత కూసుమంచి మండలం భగత్ వీడుకు చేరుకున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

నీట మునిగిన మోటార్లు, ప్యానెల్ బోర్డులు : కోతకు గురైన పొలాలు, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా రైతులు పంట నష్టంపై అన్నదాతలు తమకు జరిగిన నష్టాన్ని బృంద సభ్యులకు వివరించారు. జాతీయ రహదారిపైనే పాలేరు నియోజకవర్గంలో జరిగిన వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వ్యవసాయ ఉద్యాన అధికారులు నష్టం వివరాలను కేంద్ర బృందానికి విన్నవించారు.

రెండో బృందం మల్లాయిగూడెం పంచాయతీలో వరదల ధాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రహదారిని పరిశీలించింది. పాలేరు జలాశయం వద్ద గండి పడిన సాగర్ ఎడమ కాల్వను పరిశీలించారు. జలవనరుల శాఖ సీఈ విద్యాసాగర్ జిల్లాలో సాగునీటి రంగానికి జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి వివరించారు. తర్వాత ఎర్రగడ్డ తండాకుచేరుకుని భారీ వర్షాలకు నీట మునిగిగిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పంపౌ హౌజ్​ను పరిశీలించారు. నీట మునిగిన మోటార్లు, ప్యానెల్ బోర్డులను పరిశీలించారు.

కూసుమంచి మండలంలో పర్యటించిన కేంద్ర బృందం : కూసుమంచి మండల పర్యటన తర్వాత ఖమ్మం గ్రామీణంంలోని గూడూరుపాడు తనకంపాడు గ్రామాల పరిధిలో ఆకేరు వరదకు కొట్టుకుపోయిన పంట పొలాలు, కోతకు గురై భారీగా ఇసుక మేటలు వేసిన వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నష్టపోయిన పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు గ్రామాల రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులను ఏయే పంటలు సాగు చేస్తున్నారని వివరాలు అడిగారు.

పంటలసాకుగు ఎంత ఖర్చయింది? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు, భారీ వర్షాలు వరదలు మిగిల్చిన నష్టాలపై వివరించి తమ గోడువెళ్లబోసుకున్నారు. అనంతరం పంట నష్టానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కేంద్రం బృందం తిలకించింది. కస్నా తండాలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న, నీట మునిగిన ఇళ్లను కేంద్ర బృందం పరిశీలించింది.

రెండో రోజూ జిల్లాలో కొనసాగనున్న కేంద్ర బృందాల పర్యటన : బాధితులతో మాట్లాడి వరద మిగిల్చిన నష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో పర్యటించారు. తండాలో ఇళ్లను పరిశీలించారు. తండా వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు,వరద బాధితులు మనోధైర్యం కోల్పోవద్దంటూ కేంద్రం బృందం సభ్యులు భరోసా ఇచ్చారు.

కేంద్ర బృందాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి.

'మున్నేరు' మిగిల్చిన విషాదం : ఆనవాళ్లను కోల్పోయిన ఆవాసాలు - కట్టుబట్టలతో రోడ్డునపడ్డ బాధితులు - Munneru Flood in Khammam

Mahabubabad Floods : వర్షాలు తగ్గినా వదలని ముప్పు.. రైతుల ఆందోళన

Last Updated : Sep 11, 2024, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.