CENTRAL GOVT FUNDS FOR AP ROADS : ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
📢 Andhra Pradesh 🛣
— Nitin Gadkari (@nitin_gadkari) October 24, 2024
In Andhra Pradesh, we have sanctioned ₹252.42 Cr for the upgradation and development of a 6-lane elevated corridor at Ranasthalam, Srikakulam. This project will be instrumental in alleviating traffic congestion, enhancing road safety, and improving urban…
మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన రహదారుల అభివృద్ధికి కేంద్రం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏపీలో 200.06 కిలో మీటర్ల పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (Central Road Infrastructure Fund) నుంచి 400 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు నితిన్‌గడ్కరీ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో 98 కోట్ల రూపాయలతో 4 వరుసలతో ఆర్వోబీని నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వెళ్లి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవసరాల గురించి చర్చించారు. దీంతో వరుసగా ఏపీకి నిధులు విడుదల అవుతున్నాయి. కేటాయించిన నిధులు రాష్ట్ర అభివృద్ధి, పురోగతికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.