ETV Bharat / state

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్- రాష్ట్రంలో 924 గిరిజన ఆవాసాల్లో అమలుకు ప్రతిపాదనలు - CENTRAL GOVT ON TRIBAL DEVELOPMENT - CENTRAL GOVT ON TRIBAL DEVELOPMENT

దేశంలో గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారించిన కేంద్రం- రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924 గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు

Development On Tribal Areas
Central Govt Development On Tribal Areas (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 10:33 PM IST

Central Govt Focus On Tribal Areas : గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది. ఏజెన్సీలు, మైదాన ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో 4జీ సర్వీసులు, అన్ని గ్రామాలకు వంద శాతం విద్యుదీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924 గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టనుంది. దీనికి రాష్ట్ర నిధులు లేకుండా కేంద్రమే మొత్తం నిధులు కేటాయిస్తుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్‌ జాతీయ ఉన్నత్‌ గ్రామ అభియాన్‌గా మార్చింది.

రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ పథకం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.79,156 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. పథకం వివరాలను ముసాయిదా రూపంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 17 మంత్రిత్వశాఖలు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నాలుగు కమిటీలు వేయాలని కేంద్రం తెలిపింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అపెక్స్‌ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయుల్లో కమిటీలు మౌలిక సదుపాయాలు, ఇతర పనుల ప్రతిపాదనల్ని నోడల్‌ విభాగమైన గిరిజన సంక్షేమశాఖ ద్వారా పంపించనున్నాయి. పీఎం జుగా కార్యక్రమాలకు ప్రత్యేక విధివిధానాలు త్వరలో జారీ చేస్తామని వెల్లడించింది. గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్‌ పేరిట నూరు శాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొంది.

కేంద్రం చేపట్టే పనులు : కరెంటు లేని గిరిజన ఆవాసాల్లో కుటుంబాలు, ప్రభుత్వ విభాగాలకు విద్యుత్తు సౌకర్యం, రహదారుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది.

  • ఏజెన్సీ ప్రాంతాల్లో 5 కి.మీ., మైదాన ప్రాంతాల్లో 10 కి.మీ. దూరంలో హెల్త్‌సెంటర్‌ లేకుంటే సంచార మెడికల్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. గిరిజన కుటుంబాలకు ఆయుష్మాన్‌ భారత్‌ వైద్య బీమా కార్డుల పంపిణీ చేస్తుంది.
  • గిరిజన రైతుల సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపు. పశుపోషణ కార్యక్రమాలు చేపడతారు.

కొత్త అంగన్‌వాడీలకు రూ.12 లక్షలు : రాష్ట్రంలో ఇప్పటివరకు అమలైన పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ కింద 81 గిరిజన ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి మహిళాశిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పాత నిబంధనల ప్రకారం కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.12 లక్షల చొప్పున నిధులివ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల ఉన్నతీకరణకు రూ.లక్ష చొప్పున అందించనుంది.

జనం బుద్ధిచెప్పినా బీఆర్ఎస్​కు బుద్ధిరాలే - అసెంబ్లీలో సీఎం రేవంత్​ - Revanth on Tribal Areas Development

చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.