ETV Bharat / state

ఆ రుచికి దాసోహమే - విదేశాలకు మన పీతలు - GREEN CRAB HATCHERY IN KONASEEMA

కోనసీమలో పచ్చ పీతల హేచరీ - రూ.2.75 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

Green Crab Hatchery in Konaseema
Green Crab Hatchery in Konaseema (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 7:11 PM IST

Green Crab Hatchery in Konaseema : మాంసాహార ప్రియులు పీతల కూరంటే చెవి కోసుకుంటారు. సముద్రాలు, నదీ తీర ప్రాంతాల్లో లభించే పీతల రుచికి దాసోహం అనాల్సిందే. చేపలు, రొయ్యల మాదిరిగానే పీతల పెంపకమూ కొన్నాళ్లుగా నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి ఉన్న గిరాకీ అన్నదాతలను ఈ సాగు దిశగా ప్రోత్సహిస్తోంది. అయితే పీతల సాగులో ఉన్న ఇబ్బందులను తొలగించి, ఎగుమతిని ప్రోత్సహించేలా ఏపీ సర్కార్ చేస్తున్న కృషి ఫలితాలనిస్తోంది.

విదేశాల్లో ఎక్కువగా పచ్చ పీతలను వినియోగిస్తారు. ఈ క్రమంలోనే పచ్చ పీతల హేచరీని డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిరయానం వద్ద 5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. సాగుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. దీంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌ (జీసీఎఫ్‌) నుంచి రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ) అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించింది. దేశంలో ఇప్పటి వరకు ఇటువంటి హేచరీ చెన్నైలో (రాజీవ్‌గాంధీ ఆక్వా సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చర్‌) మాత్రమే ఉంది. ఏడాదికి 10 లక్షల పిల్ల పీతల ఉత్పత్తి లక్ష్యం. తద్వారా ఇతర జిల్లాల అన్నదాలకూ సరఫరా చేసి ఎగుమతులతో విదేశీ మారకద్రవ్యం పెంచుకునే వీలుంది.

సీడ్‌ కావాలంటే 1300 కిలోమీటర్లు : కోనసీమ జిల్లాలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని సముద్రతీరం, మడ అడవులు పీతల సాగుకు అనుకూలం. గతంలో పల్లం, భైరవపాలెం, చిర్రయానాం, గచ్చికాయలపొర, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ ప్రాంతాల్లోని 3 వేల ఎకరాల్లో సాగు ఉండేది. ప్రస్తుతం ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల పరిధిలో 100 ఎకరాల్లో 273 మంది సాగు చేస్తున్నారు. సీడ్‌ కావాలంటే రైతులంతా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై వెళ్లి ఒక్కో పీత పిల్లకు రూ.12, రవాణాకు రూ.3 వెచ్చించి తెచ్చుకుంటున్నారు. వాహన అద్దెకు సుమారు రూ.60 వేల వ్యయమవుతుండడం, రవాణాలో దాదాపు 50 శాతం చనిపోతుండటంతో క్రమేపీ సాగుకు చాలా మంది దూరమయ్యారు. పీతల హేచరీ వస్తే గరిష్ఠంగా 5 కిలోమీటర్ల దూరంలోనే వీరికి సీడ్‌ లభిస్తుంది.

విదేశాల్లో ఎంతో గిరాకీ : ఔషధ గుణాలున్న ఈ పీతలకు జపాన్, సింగపూర్, చైనా, ఇండోనేషియా, వియత్నాం, మలేసియా తదితర దేశాల్లో మంచి గిరాకీ ఉంది. సాగు పూర్తయిన తరువాత పీతలను సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం నుంచి రైలులో చెన్నై తీసుకెళ్తారు. మర్నాడు సాయంత్రం ఎయిర్‌కార్గోలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

తక్కువ పెట్టుబడి - అధిక లాభాలు : పచ్చ పీతల పెంపకానికి ఆక్వా సాగు కన్నా తక్కువ పెట్టుబడి అవుతోంది. దీంతో పాటు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. పీతల గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి (బర్త్‌ రేట్‌) విదేశాల్లో 8 శాతం ఉంటే, దేశీయంగా 10 నుంచి 12 శాతం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నాణ్యమైన సీడ్‌ భారత్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. గుడ్లు పెట్టిన 15 రోజుల తరువాత 3.5 మి.మీ. నుంచి 5 మి.మీ. పరిమాణం ఉన్న పిల్లలను రైతులకు విక్రయిస్తారు.

ఎకరా విస్తీర్ణంలో మూడు అడుగుల లోతున్న చెరువులో 1500 నుంచి 2000ల పిల్లలు విడిచిపెడితే 30 నుంచి 40 శాతం మేర చనిపోతాయి. ఒక్కోసారి చిన్నవాటిని పెద్దవి తినేస్తుంటాయి. సీడ్‌ (ఒక్కో పిల్ల)కు రూ.12 చొప్పున చెల్లిస్తే మొత్తంగా రూ.24 వేలు, మేతకు రూ.లక్ష ఖర్చవుతుంది. ఐదు నెలల్లోనే ఉత్పత్తి చేతికి వస్తుంది. సీజన్‌ ఆధారంగా 500- 750 గ్రాములు ఉన్న (మీడియం) పీత ధర రూ. 1500 నుంచి రూ. 2500 పలుకుతుంది. 750 గ్రాములకు పైబడితే రూ. 2500 నుంచి రూ.3500 పలుకుతుంది. తాళ్లరేవు మండలం పోలేకుర్రు ఐలాండ్‌లో ఉన్న 2 వేల ఎకరాల్లోని మడ అడవులు పీతల పెంపకానికి అనువైనవని మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్‌ వివరించారు. అయితే చెరువులతోపాటు 35 పీపీఎం లవణ సాంద్రత ఉండే నీటిని సమకూర్చి వర్టికల్‌ విధానంలోనూ సాగు చేయవచ్చన్నది శాస్త్రవేత్తల మాట.

రెండు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి : కాట్రేనికోన మండలంలో దేశంలోనే రెండో పచ్చ పీతల హేచరీ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్‌. మహేశ్‌కుమార్ తెలిపారు. రెండు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి, పిల్ల పీతల ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. స్థానికంగా సీడ్‌ ఉంటే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు ఆక్వా రైతులంతా దృష్టి సారిస్తారని మహేశ్​కుమార్ వెల్లడించారు.

భారీ పీత.. ధర మెండు

ఉప్పాడలో చిక్కిన ఆ పీత ఖరీదు రూ. 1000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.