ETV Bharat / state

రాష్ట్రంలో హైవేల విస్తరణకు కేంద్రం గ్రీన్​సిగ్నల్- రూ.2 లక్షల కోట్లతో పచ్చజెండా - 8 National Highways Expansion

Central Goverment Green Sigal to 8 National Highway Develop in AP : రాష్ట్రంలో ఎనిమిది హైవేల విస్తరణకు కేంద్రం సుముఖంగా ఉంది. దేశ వ్యాప్తంగా హైవేల విస్తరణకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భారత్​మాల పేరుతో వీటిని విస్తరించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనతో వీటిలో కదలిక వచ్చింది. త్వరలో హైవేల నిర్మాణం పట్టాలెక్కే అవకాశం ఉంది.

national_highway_expansion
national_highway_expansion (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 1:03 PM IST

Central Goverment Green Sigal to 8 National Highway Develop in AP : కేంద్రం, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి రావడంతో ఏపీ ప్రయోజనాలే అజెండాగా సీఎం చంద్రబాబు తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా తాత్కాలికంగా నిలిచిపోయిన 8 జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో వీటి ప్రాముఖ్యతను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చిండంతో వీటిలో కదలిక వచ్చింది. త్వరలో కీలకమైన హైవేల నిర్మాణం పట్టాలెక్కే అవకాశం ఉన్నందున సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనతో వీటిలో కదలిక : రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన 8 జాతీయ రహదారుల విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యేందుకు చంద్రబాబు మార్గం సుగమనం చేశారు. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది. భారత్‌మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఎన్‌హెచ్‌ల బడ్జెట్‌కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబరు నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం ఆదేశించింది.

హైదరాబాద్‌-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway

దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో మన రాష్ట్రంలోని 8 వేల 243 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి గడ్కరీతో చంద్రబాబు సమావేశమైనప్పుడు ఈ 8 జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు. ఇందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో చంద్రబాబు మరోసారి దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటి విషయం తీసుకెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర అవసరాల దృష్ట్యా వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు తొలగిన అడ్డంకులు - టోల్‌ బాధ్యత నుంచి జీఎమ్మార్‌ ఔట్! - hyderabad vijayawada highway

వెంటనే విస్తరణ అవసరం : ఆగిపోయిన నేషనల్​ హైవేలలో కొండమోడు-పేరేచర్ల కీలకమైనది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు 50 కిలోమీటర్ల నాలుగు వరుసలుగా విస్తరణకు వెయ్యి 32 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. గుత్తేదారు ఎంపికయ్యాక ఎల్​ఓఏ (LOA) ఇచ్చే దశలో ఆగిపోయింది. గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు రాకపోకలకు చేసే వారికి ఈ రహదారి అత్యంత కీలకంగా ఉంది. ఈ 50 కిలోమీటర్లు నాలుగు వరుసలు అందుబాటులోకి వస్తే, అక్కడి నుంచి అద్దంకి- నార్కట్‌పల్లి నాలుగు వరుసల రహదారికి అనుసంధానించవచ్చు.

ప్రస్తుతం కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి కేవలం 7 మీటర్ల వెడల్పుతో అత్యంత ఘోరంగా తయారైంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు, తెనాలి, చీరాల తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది దూరమైనా సరే విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తున్నారు. దీంతో విశాఖపట్నం- కొత్తవలస- అరకు మార్గం రద్దీగా ఉంటుంది. ఇందులో పెందుర్తి నుంచి బౌధార వరకు 42 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచిన దశలో పనులు ఆగిపోయాయి. ఈ రహదారి విస్తరణ పనులు తక్షణం మొదలుపెట్టాల్సి ఉంది.

ఐదేళ్లుగా బిల్లులు చెల్లించని వైఎస్సార్సీపీ సర్కార్​ - చంద్రబాబు సమీక్షపై కాంట్రాక్టర్ల ఆశలు - funds to ROAD contractors in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.