CC Cameras in RTC Buses Vemulawada : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో, సంస్థ లాభాల బాట పట్టిందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ(Vemulawada Temple) ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా ఫేజ్-2లో భాగంగా బస్సుల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో(Mahalakshmi Scheme) బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) పేర్కొన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయన్నారు. బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఈవ్ టీజింగ్, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలకు నిఘా కెమెరాలతో అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
Vemulawada Temple : బస్సులో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిఘా కెమెరాలు ఏర్పాటుతో మహిళలకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తమ ఇంట్లో ఉన్నట్టు భావన ఏర్పడుతుందని తెలిపారు. ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సులు సరిపోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో, డిపోకు తొమ్మిది బస్సులు కేటాయించడంతోపాటు త్వరలో కొనుగోలు చేసే 500 బస్సులో మరిన్ని బస్సులు కేటాయిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి భద్రాచలం, యాదగిరిగుట్టకు బస్సులు నడిపించడానికి చర్యలు తీసుకున్నట్లు ఆది శ్రీనివాస్ చెప్పారు.
దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీతో భేటీ
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బస్సుల్లో భరోసాలో భాగంగా సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిపోలో ఉన్న సుమారు 140 బస్సులలో నిఘా కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2004 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జిల్లాకు మంజూరు అయిందని సిబ్బంది నియామకం కావాల్సి ఉందన్నారు. వేములవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా అధిక సంఖ్యలో సిబ్బందిని వినియోగించనున్నట్లు వివరించారు.
"మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో, సంస్థ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సులు సరిపోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాము. డిపోకు తొమ్మిది బస్సులు కేటాయించడంతోపాటు త్వరలో కొనుగోలు చేసే 500 బస్సులో మరిన్ని బస్సులు కేటాయిస్తాం". - ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి