ETV Bharat / state

నకిలీ కాల్ సెంటర్లపై నజర్​ - దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు - CBI RAIDS ON FAKE CALL CENTERS - CBI RAIDS ON FAKE CALL CENTERS

CBI Raids On Fake Call Centers : దేశవ్యాప్తంగా నకిలీ కాల్​ సెంట్రర్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉక్కుపాదం మోపింది. 32 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున సొమ్ము స్వాధీనం చేసుకోవండంతో పాటు పలువురిని అరెస్ట్​ చేసింది.

CBI RAIDS ON FAKE CALL CENTERS
CBI RAIDS ON FAKE CALL CENTERS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 2:44 PM IST

Updated : Sep 30, 2024, 3:59 PM IST

CBI Raids On Fake Call Centers in Across The Country : దేశవ్యాప్తంగా రోజురోజుకీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. సరికొత్త మార్గాల్లో అందినంత దోచేస్తూ, సైబర్​ క్రిమినల్స్​ పేట్రేగిపోతున్నారు. వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతూ వందల నుంచి వేల కోట్ల రూపాయల సొమ్మును కాజేస్తున్నారు. ఉద్యోగాలు, ఫేక్​ కేసులు, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్​మెంట్​ పేరిట ఇలా ప్రతి రోజూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ క్రమంలోనే సైబర్ క్రిమినల్స్​పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సైబరాసురుల ఆట కట్టించేందుకే పలు నకిలీ కాల్ సెంటర్లపై ఏక కాలంలో దాడులు చేస్తూ ఇవాళ విరుచుకుపడింది.

నకిలీ కాల్ సెంటర్లపై దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖ, పుణె, అహ్మదాబాద్‌లో సీబీఐ ముమ్మర తనిఖీలు చేసింది. ఈ క్రమంలోనే 170 మందితో సైబర్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న 4 కాల్ సెంటర్లు గుర్తించింది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్‌లో ఐదుగురు, విశాఖలో 11 మంది, పూణెలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వారి నుంచి రూ.58 లక్షల నగదు, 3 వాహనాలు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా నిందితుల నుంచి ఎలక్ట్రిక్ పరికరాలు, ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీన పరచుకుంది.

Last Updated : Sep 30, 2024, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.