ETV Bharat / state

ఎమ్మార్ కేసులో పదకొండేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు - CBI court verdict on Emar case - CBI COURT VERDICT ON EMAR CASE

CBI court verdict on Emar case: ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై పదకొండేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఎమ్మార్ కేసు నుంచి తొలగించాలన్న పలువురు నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చి డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేసింది. వైసీపీ మాజీ ఎంపీ కోనేరు ప్రసాద్ మరణించడంతో ఆయనపై విచారణ ముగించింది. బదిలీ అయిన సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు నేడు చివరి రోజున 11 ఏళ్లుగా కొనసాగుతున్న డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించారు.

CBI court verdict on Emar case
CBI court verdict on Emar case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:52 PM IST

CBI court verdict on Emar case: ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్ సన్నిహితుడు ఎన్.సునీల్ రెడ్డి సహా కేసు నుంచి తొలగించాలన్న నిందితుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యపై ఐపీసీ సెక్షన్లు తొలగించిన కోర్టు,అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన అభియోగాలపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వైసీపీ మాజీ ఎంపీ కోనేరు ప్రసాద్ మరణించడంతో ఆయనపై విచారణ ముగించింది. బదిలీ అయిన సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు నేడు చివరి రోజున 11 ఏళ్లుగా కొనసాగుతున్న డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించారు.

ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై పదకొండేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఎమ్మార్ కేసు నుంచి తొలగించాలన్న పలువురు నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చి డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేసింది. ఎమ్మార్ ప్రాజెక్టు ఒప్పందాలు, వాటా విలువ, విల్లాల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని తేల్చిన సీబీఐ 2013లో చార్జిషీట్ దాఖలు చేసింది. ఏపీఐఐసీ అప్పటి ఎండీ బీపీ ఆచార్య, ఎన్. సునీల్ రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె.విశ్వేశ్వరరావు, కోనేరు మధు, టి.రంగారావు, శ్రవణ్ గుప్తా, జి.వి.విజయరాఘవ, శ్రీకాంత్ జోషితో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, బౌల్డర్ హిల్స్ కంపెనీలను నిందితులుగా పేర్కొంది. మనీలాండరింగ్ అంశాలపై విచారణ జరిపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జగన్ సన్నిహితులు ఎన్. సునీల్ రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, కోనేరు ప్రదీప్ తదితరులకు చెందిన 167 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. తుమ్మల రంగారావు అప్రూవర్ గా మారడంతో సాక్షిగా మార్చారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు మధుపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టివేసింది. పలువురు నిందితులు 2013లో డిశ్చార్జి పిటిషన్లు వేయగా.. అప్పటి నుంచి ఆరుగురు జడ్జిలు బదిలీ కావడం, తదితర కారణాల వల్ల కొలిక్కి రాలేదు. సుదీర్ఘంగా వాదనలు విన్న సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు బదిలీ కావడంతో, ఇవాళ చివరి రోజున ఎమ్మార్ కేసు డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించారు.

Live వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత పవర్​పాయింట్ ప్రజెంటేషన్- కడప నుంచి ప్రత్యక్ష ప్రసారం - Sunitha Press Meet

ఎన్.సునీల్ రెడ్డి, కోనేరు ప్రదీప్, విజయరాఘవ, శ్రీకాంత్ జోషితో పాటు ఎమ్మార్ ఎంజీఎఫ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్, బౌల్డర్ హిల్స్, సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్, ఆసరా థీమ్ ప్రాజెక్ట్స్ కంపెనీల డిశ్చార్జి పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది. కోనేరు ప్రసాద్ మరణించడంతో ఆయనపై విచారణను ముగించింది. బీపీ ఆచార్యపై ఐపీసీ 120బి, 409 సెక్షన్లను తొలగించిన న్యాయస్థానం.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13 (1)(సి)(డి) ప్రకారం అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాంగూడలోని 535 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్లు సెంటర్లు, గోల్ఫ్ కోర్సులు, మోడల్ టౌన్ షిప్ నిర్మాణం కోసం 2002లో దుబాయ్ కి చెందిన ఎమ్మార్ పీజేఏసీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీఐఐసీకి 49శాతం, ఎమ్మార్ కు 51 శాతం వాటాతో ఒప్పందం జరిగాయి. ఆ తర్వాత కుట్రపూరితంగా ఏపీఐఐసీ వాటాను 26శాతానికి తగ్గించినట్లు సీబీఐ వెల్లడించింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎమ్మార్ ఛైర్మన్, కేవీపీ రామచంద్రరావు, కోనేరు రాజేంద్రప్రసాద్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు మోడల్ టౌన్ షిప్ లో విల్లాల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు సీబీఐ, ఈడీ తేల్చాయి. గజానికి 5వేల రూపాయలుగా అమ్మినట్లు రికార్డుల్లో చూపి.. సుమారు 50వేల రూపాయల వరకు గజం అమ్మి సొమ్ము చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. విల్లాల అక్రమాల వచ్చిన సొమ్ము జగన్ సన్నిహితుడు ఎన్.సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి చేరినట్లు ఈడీ వెల్లడించింది.

జగన్ అక్రమాస్తుల కేసు- న్యాయమూర్తి బదిలీ! మళ్లీ మొదటికొచ్చిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ - Jagan Disproportionate Assets Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.