ETV Bharat / state

తిరుమల శ్రీవారి ఆలయం హుండీలో చోరీ - THEFT IN TIRUMALA SRIVARI HUNDI

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తిరుమల శ్రీవారి హుండీలో చోరీ - ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tirumala Srivari Hundi Theft
Theft in Tirumala Srivari Hundi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 11:27 AM IST

Theft in Tirumala Srivari Hundi : ఏపీలోని తిరుమల శ్రీవారి హుండీలో నగదు దొంగతనం జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని స్టీల్‌ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం డబ్బులను దొంగతనం చేసి పారిపోయాడు. దీంతో సీసీ కెమెరా దృశ్యాల ద్వారా చోరీ జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు అప్పగించారు.

Tirumala Vaikunta Dwara Darshan 2025 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులు ప్రజలకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలు మినహా చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశమైన ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.

శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం : మరోవైపు శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్‌ పొందినవారికి ప్రతి సేవకు భక్తులకు మార్పు చేసుకునే అవకాశం లేదని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. గతంలో టీటీడీ ఛైర్మన్​గా భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు పాలక మండలి భక్తుల మార్పునకు అవకాశమిస్తూ తీర్మానం చేసింది. కానీ అప్పట్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల ఇది అమలు కాలేదు. సాధారణ రోజుల్లో రూ.కోటి, శుక్రవారం రూ.కోటిన్నర విలువైన ఈ టికెట్‌ను తీసుకున్న భక్తుడు తన సంబంధీకులు ఐదుగురితో కలిసి శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే ఈ సేవకు అనుమతిస్తారు.

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం - క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిద్ధమవుతున్న సిట్

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్ - ఆ దర్శన టికెట్ల కోటా పెరిగింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.