ETV Bharat / state

కోనసీమ జిల్లాలో పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు - ఇద్దరు మృతి - CAR FALLS INTO CANAL P GANNAVARAM

చింతావారిపేట సమీపంలో ఘటన - గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

Car Falls Into Canal in P Gannavaram
Car Falls Into Canal in P Gannavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 8:08 AM IST

Updated : Dec 10, 2024, 10:17 AM IST

Car Plunges Into canal P Gannavaram : అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి.గన్నవరం మండంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య డ్రైవింగ్‌ చేస్తోందని భర్త విజయ్​కుమార్ తెలిపారు. ఉమతో పాటు కుమారులు మనోజ్, రిషి కాలువలో గల్లంతయ్యారని చెప్పారు. తన కళ్లముందే వారు కొట్టుకుపోయారని విజయ్​కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఉమ, పెద్ద కుమారుడు మనోజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Car Crashed into the Canal: తూర్పుగోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి

Last Updated : Dec 10, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.