ETV Bharat / state

అమరావతి ఐకానిక్ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు - డిజైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

శాసనసభ, హైకోర్టు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లను మార్చకూడదని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Capital_Amaravati_Iconic_Buildings
Capital Amaravati Iconic Buildings (ETV Bharat)

CAPITAL AMARAVATI ICONIC BUILDINGS : ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్‌ భవనాలకు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శాసనసభ, హైకోర్టు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లను మార్చకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్‌తో పాటు, ఐకానిక్‌ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ (Norman Foster and Partners) రూపొందించింది. ఆంధ్రప్రదేశ్​లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐకానిక్‌ బిల్డింగ్స్ ఆకృతులపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రూపొందించిన ఆ ఆకృతుల్లో ఇప్పుడేమైనా మార్పులు చేయాలా అనే కోణంలో చర్చించారు.

దీంతో బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులూ చేయరాదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే మళ్లీ వాటిని మారిస్తే మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందన్న ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా హైకోర్టు, సచివాలయం టవర్లకు సంబంధించిన పునాదులు సైతం ఇప్పటికే పూర్తయినందున, ఇప్పుడు ఆకృతులను మార్చాలనుకోవడం సరికాదన్న అభిప్రాయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది.

పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్​ - ఇక పనులు రయ్‌ రయ్‌ - NHAI on Amaravati ORR Project

ఆర్కిటెక్ట్ కోసం సీఆర్‌డీఏ టెండర్లు: మరోవైపు ఐకానిక్‌ బిల్డింగ్స్ డిజైన్లకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్ నియామకం కోసం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. అయితే లండన్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు సైతం ప్రీబిడ్‌ మీటింగుకు హాజరవడం గమనార్హం. ఆ కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేసి ఉంటుందని సీఆర్‌డీఏ భావిస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఆర్కిటెక్ట్‌ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు చెప్పడంతో, ఆ భవనాల నిర్మాణానికి సైతం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది.

భవనాల డిజైన్లు ఇలా: అప్పట్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టుని బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలని ఐదు టవర్లుగా, డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించాలనుకున్నారు. అప్పటి అంచనాల ప్రకారం వాటి నిర్మాణ వ్యయం 11 వేల 752 కోట్లు. శాసనసభ భవనం నిర్మితప్రాంతం 11.67 లక్షల చదరపు అడుగులు, హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం 16.85 లక్షల చదరపు అడుగులు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాంతం 68.88 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati

మళ్లీ అదే సంస్థ ఆసక్తి: 2019కి ముందు తెలుగుదేశం హయాంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రఖ్యాత కంపెనీలు మళ్లీ అటువంటి అవకాశం కోసం చూస్తున్నాయి. ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ కంపెనీ మళ్లీ రాజధాని నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనం. జగన్‌ ప్రభుత్వంలో అనేక చేదు అనుభవాల్ని ఈ కంపెనీ ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ వంటి సంస్థల్ని అనేక ఇబ్బందులు పెట్టింది.

వారితో సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లను కాలరాసింది. బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బకాయిలు వసూలు చేసుకోవడానికి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్‌డీఏ ఊహించలేదు. కానీ ప్రీబిడ్‌ మీటింగుకు హాజరవడంతో ఆ కంపెనీగా ఆసక్తిగా ఉందనే విషయం తెలిస్తోంది. ఆ సంస్థ ప్రీబిడ్‌ మీటింగుకు మాత్రమే హాజరైందా లేదంటే బిడ్‌ సైతం దాఖలు చేసిందా అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. అయితే ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసి ఉండి, దానికే టెండరు ఖరారైతే సమయం ఆదా అవుతుందని సీఆర్‌డీఏ అభిప్రాయపడుతోంది.

అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.